ఈ మధ్య కాలంలో చాలామందిని వినికిడి సంబంధిత సమస్యలు వేధిస్తున్నాయి. కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా వినికిడి సంబంధిత సమస్యలకు సులువుగా చెక్ పెట్టే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. వినికిడి సమస్యలతో బాధ పడేవాళ్లు 85 డెసిబెల్స్ కు పైగా శబ్దాలకు వీలైనంత దూరంగా ఉండాలి. ఇయర్ ప్లగ్స్ లేదా నాయిస్ క్యాన్సిలేషన్ హెడ్ ఫోన్స్ వాడటం వల్ల వినికిడి సమస్యలకు చెక్ పెట్టవచ్చు.
హెడ్ ఫోన్స్ ను ఎక్కువగా వినియోగించే వాళ్లు వాల్యూమ్ ను తక్కువగా సెట్ చేసుకోవడం వల్ల మంచి ఫలితాలను సొంతం చేసుకోవచ్చు. అప్పుడప్పుడూ బ్రేక్స్ తీసుకుని హెడ్ ఫోన్స్ పక్కన పెట్టేయడం ద్వారా చెవులకు సంబంధించిన సమస్యలు రాకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. మనలో కొంతమంది చెవులను శుభ్రం చేయడానికి కాటన్ స్వాబ్స్ ఉపయోగిస్తూ ఉంటారు. వీటిని వాడటం వల్ల చెవులకు మరింత నష్టం వాటిల్లుతుంది.
కసరత్తులు చేయడంతో పాటు మంచి ఆహారం తీసుకోవడం వల్ల రక్త ప్రసరణ పెరిగి చెవులు ఆరోగ్యంగా ఉండే అవకాశాలు ఉంటాయి. వినికిడి సమస్య చిన్న సమస్యే అయినా వీలైనంత వేగంగా చికిత్స చేయించుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. ఈ సమస్య విషయంలో నిర్లక్ష్యంగా వవహరిస్తే చెవులకు హాని కలుగుతుందని చెప్పవచ్చు.
చెవుల విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా దీర్ఘకాలంలో ఇబ్బందులు పడే అవకాశాలు అయితే ఉంటాయి. వినికిడి శక్తి సమస్యతో బాధ పడేవాళ్లు ఈ విషయాలను గుర్తుంచుకోవాలి. చెవుల విషయంలో సొంతంగా ఇయర్ డ్రాప్స్ ను వాడటం కూడా మంచిది కాదని చెప్పవచ్చు.