విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారా… ఈ సమస్యలు తప్పవు!

శరీర ఆరోగ్యం విషయంలో విటమిన్-డి ప్రాముఖ్యతను గురించి  ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ విటమిన్ డి ఎక్కువగా ఉదయం పూట ఏర్పడే సూర్యకాంతి లో లభిస్తుంది. ఈ విటమిన్ డి ఎదిగే పిల్లలకు చాలా అవసరమని మనం వింటూ ఉంటాం. అలాంటి విటమిన్ డి మన శరీరంలో లోపిస్తే  ఎలాంటి వ్యాధులు తలెత్తుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

 

విటమిన్-డి మన శరీరానికి సరిపడా లేకపోవడం వల్ల మొదటిగా మన ఎముకలు బలహీనతకు గురవుతాయి. తద్వారా కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు వంటి సమస్యలకు దారితీస్తాయి. ఇక అంతే కాకుండా మన శరీరంలో విటమిన్ డి  లోపిస్తే గుండెజబ్బులు వంటి సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉందని తెలుస్తోంది.

అందుకే ఎంత పుష్కలంగా ఉంటే  మన గుండె అంత దృఢంగా ఉంటుంది. ఇక మన శరీరంలో విటమిన్-డి లోపం రోగ నిరోధక శక్తి సామర్థ్యాన్ని తగ్గించి తొందరగా వ్యాధుల బారిన పడటానికి కారణం అవుతుంది.

 

ఎవరికైతే విటమిన్ లోపం ఉంటుందో అలాంటి వారు తొందరగా డయాబెటిస్ వ్యాధికి గురయ్యే అవకాశాలు ఉంటాయి. ఇక రక్తపోటు వంటి సమస్యలకు కూడా విటమిన్ డి లోపం కొంతవరకూ కారణం అని తెలుస్తుంది. కాబట్టి మన శరీరానికి విటమిన్-డి కలిగిన ఆహార పదార్థాలను ఎక్కువ మొత్తంలో తీసుకోవడం మంచిది. అదేవిధంగా సూర్యోదయం అయ్యే సమయంలో కాసేపు బయట కూర్చుని ఆశ్చర్య కిరణాలు మనపై పడటం వల్ల కూడా మనం విటమిన్ డి మన శరీరానికి పొందవచ్చు.