లివర్ పనితీరు మందగిస్తోందా… అయితే ఈ నియమాలు తప్పక పాటించండి!

ప్రపంచవ్యాప్తంగా అతి చిన్న వయసులోనే ఫ్యాటీ లివర్ అనారోగ్య సమస్యతో బాధపడే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. దీనికి ముఖ్య కారణం ప్రతిరోజు ఆల్కహాల్ ఎక్కువగా సేవించడం,ప్రతిరోజు తినే ఆహారంలో శాచ్యురేటెడ్, ట్రాన్స్ ఫ్యాట్స్‌, కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండడం, ఎక్కువ పని గంటలు ఒకేచోట కూర్చుని పని చేయడం వంటి కారణాలు ప్రధానంగా చెప్పుకోవచ్చు.ఫ్యాటీ లివర్ సమస్య ఇప్పటికిప్పుడు తీవ్రమైనది కాకపోయినప్పటికీ ఈ సమస్యకు తక్షణ పరిష్కారం చూపకపోతే భవిష్యత్తులో డయాబెటిస్ ఉభకాయం హై బీపీ,ఒబెసిటి, కొలెస్ట్రాల్ వంటి అనారోగ్యాలకు కారణమవుతోంది.

మన జీవన విధానంలో వస్తున్న మార్పుల కారణంగా
మన శరీరంలో చెడు మలినాలను, కొవ్వు నిల్వలను బయటికి పంపే సామర్థ్యం తగ్గినప్పుడు మెటబాలిక్ సిండ్రోమ్ ఫ్యాటీ లివర్ సమస్యకు దారితీస్తుంది. శరీరంలో ఆల్కహాల్, కార్బోహైడ్రేట్స్ ,చెడు కొలెస్ట్రాల్ ఎక్కువైనప్పుడు లివర్ చుట్టూ అధిక స్థాయిలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోతుంది. ఆరోగ్యకరమైన టిష్యూను స్కార్ టిష్యూ రీప్లేస్ చేస్తుంది. ఈ కారణంగా ఇన్‌ఫ్లమేషన్ ఎక్కువై లివర్ పనిచేయకుండా తీవ్ర సమస్యగా మారి చివరకు లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు దారితీస్తుంది.

ఫ్యాటీ లివర్ సమస్య నుంచి తొందరగా విముక్తి పొందాలంటే మన జీవన విధానంలో సమూలమైన మార్పులు తప్పనిసరిగా చేసుకోవాలని న్యూట్రిషన్ వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అన్‌శాచ్యురేటెడ్ ఫ్యాట్స్ అధికంగా ఉన్న పండ్లు కూరగాయలను అధికంగా తీసుకోవాలి. అలాగే గ్లైసెమెక్ ఇండెక్స్ తక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. అత్యధిక కార్బోహైడ్రేట్స్ ఫ్యాట్ ఎక్కువగా ఉండే పిజ్జా, బర్గర్ సాఫ్ట్ డ్రింక్ వంటి వాటి జోలికి అస్సలు వెళ్ళకండి. తక్కువ పరిమాణంలో ఆల్కహాల్ తీసుకోవడం ఫ్యాటీ లివర్ సమస్యను తగ్గిస్తుంది. అలాగని మరీ ఎక్కువ తాగితే తీవ్ర సమస్యగా మారే ప్రమాదం ఉంది. రాత్రిళ్ళు సుఖప్రదమైన నిద్రను అనుభవిస్తూ ప్రతిరోజు కొంత శారీరక శ్రమ కలిగిన బ్రిస్క్ వాకింగ్,రన్నింగ్, వ్యాయామం వండి అలవాట్లను అలవర్చుకుంటే శరీరంలో ఉండే మలినాలు ఎప్పటికప్పుడు స్వేద గ్రంధుల ద్వారా తొలగించబడతాయి. జీవక్రియ రేటు పెరిగి లివర్ ఫంక్షన్ కూడా అభివృద్ధి చెందుతుంది. సమస్య మరి తీవ్రంగా ఉంటే తప్పనిసరిగా వైద్యులు సంప్రదించాలి.