ఎన్నో ఔషధ గుణాలు ఉన్న ముల్లంగిని వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు తరచూ ఆహారంలో తీసుకోవడంతోపాటు ప్రతిరోజు ఉదయాన్నే ముల్లంగి రసాన్ని సేవిస్తే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చునని న్యూట్రిషన్ నిపుణులు తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు.ముల్లంగిలో 25 శాతం విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది కావున మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంచి సీజనల్గా మనల్ని ఇబ్బంది పెట్టే జలుబు, దగ్గు , గొంతు నొప్పి వంటి శ్వాసకోశ ఇన్ఫెక్షన్ నుంచి రక్షణ కల్పించి బ్రాంకైటిస్, ఆస్తమా, ఫ్లూ వంటి శ్వాస కోశ వ్యాధులను అదుపు చేయడంలో సహాయపడుతుంది.
ముల్లంగిలో 90 శాతం నీరు,8 శాతం కార్బోహైడ్రేట్స్, 2 శాతం ప్రోటీన్స్ లభ్యమవుతాయి.కావున ప్రతిరోజు ముల్లంగి రసాన్ని సేవిస్తే శరీర జీవక్రియలకు అవసరమైన ఖనిజ లవణాలు లభించి శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో సహాయపడుతుంది. ముల్లంగిలో యాంటీ ఆక్సిడెంట్లు,ఫోలిక్ యాసిడ్ , యాంటీ క్యాన్సర్ లక్షణాలు పుష్కలంగా ఉండడం వల్ల ప్రతిరోజు ముల్లంగి జ్యూస్ ను సేవిస్తే క్యాన్సర్ కణాలను నివారించి లివర్ క్యాన్సర్, పెద్ద ప్రేగు క్యాన్సర్, చర్మ క్యాన్సర్,కిడ్నీ క్యాన్సర్ వంటి అనేక క్యాన్సర్లను తొలగించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
ముల్లంగి లోని ఔషధ గుణాలు ఇన్సులిన్ వ్యవస్థను
బలోపేతం చేసి రక్తంలోని గ్లూకోస్ స్థాయిలను నియంత్రించి షుగర్ వ్యాధిని అదుపులో ఉంచుతుంది.
ముల్లంగిలో అత్యధికంగా కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్ ,మాంగనీస్ వంటి మూలకాలు పుష్కలంగా లభిస్తాయి. కావున హైబీపీ సమస్యను దూరం చేస్తుంది, ఆర్థరైటిస్ ఆస్తియోఫోరోసిస్ వల్ల వచ్చే నొప్పుల సమస్య నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుంది, రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది. ముల్లంగిలో ఉన్న ఔషధ గుణాలు కిడ్నీ పనితీరును మెరుగుపరిచి మూత్ర సంబంధిత ఇన్ఫెక్షన్‌ను తగ్గించడానికి, మూత్రవిసర్జన సమయంలో ఏర్పడే మంటను నివారించడానికి సహాయపడుతుంది.