చురుకైన ఆలోచన శక్తిని పెంపొందించి కంద దుంప… ఎక్కడైనా కనిపిస్తే అసలు వదలకండి!

దుంప జాతి కాయకూరల్లో ఒకటైన కందగడ్డ గురించి చాలామందికి తెలియకపోవచ్చు. తెలిసిన కందగడ్డను తినటానికి చాలామంది సంకోచిస్తుంటారు కారణం కంద దుంపల్లో కొంత దురద పుట్టించే లక్షణాలు ఉండడమే. కంద దుంపను కోసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి లేకపోతే చేతులు కొంత దురదగా ఉన్నట్లు అనిపిస్తాయి అంతే.కంద దుంపను కొన్ని చోట్ల పులగందా అని కూడా అంటారు. అన్ని దుంప కూరగాయలు మాదిరి కంద దుంపను కూడా కర్రీస్, ఫ్రై, సలాడ్స్ రూపంలో తయారు చేసుకొని తినొచ్చు. తరచూ కంద దుంపను ఆహారంగా తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

కంద దుంపల్లో విటమిన్స్, మినరల్స్ , కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా లభిస్తాయి ముఖ్యంగా ఇందులో ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా లభిస్తున్నందున వీటిని ఆహారంగా తీసుకుంటే శరీరంలో మరియు రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించి గుండె ఆరోగ్యాన్ని, రక్తపోటు ముప్పును తగ్గించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు నాడీ కణాభివృద్ధికి సహాయపడడమే కాకుండా మెదడు కండరాలను ఉత్తేజ పరుస్తాయి ఫలితంగా జ్ఞాపకశక్తి మెరుగుపడి మీలో చురుకైన ఆలోచన శక్తి మెరుగుపరడానికి సహాయపడుతుంది. అలాగే మానసిక ఒత్తిడిని తగ్గించి నిద్రలేమి సమస్యను దూరం చేస్తుంది.

కంద దుంపల్లో లభించే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్,యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు శరీరంలోని వ్యాధికారక కణాలను నియంత్రించి మీలో వ్యాధి నిరోధక శక్తి పెంపొందించడమే కాకుండా అన్ని రకాల క్యాన్సర్ కణాలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా పెద్ద ప్రేగు క్యాన్సర్, ఉదర క్యాన్సర్ ప్రమాదాన్ని పూర్తిగా నియంత్రిస్తుంది. కంద దుంపల్లో ఉండే డెంటరీ ఫైబర్ జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. రక్తంలో హిమోగ్లోబిన్ ఉత్పత్తిని పెంచి రక్తహీనత సమస్యను దూరం చేస్తుంది. అతి బరువు సమస్యతో బాధపడేవారు కంద దుంపలను ఆహారంగా తీసుకుంటే ఇందులో ఉండే సహజ యాంటీ ఆక్సిడెంట్, ఫైబర్ శరీర బరువును నియంత్రించి ఉబకాయ సమస్యను దూరం చేస్తుంది.