తేనె ఆరోగ్యానికి ఎంతో మంచిదే… ఇలా ఉపయోగిస్తే మాత్రం అంతే సంగతులు!

ఈ ప్రకృతిలో సహజ సిద్ధంగా దొరికే అతి మధురమైన ఔషధ గుణాలు తేనెలో మాత్రమే పుష్కలంగా లభిస్తాయి. తేనెలో ఉన్న యాంటీ బ్యాక్టీరియల్ గుణాల కారణంగా తేనె చెడిపోకుండా కొన్ని వందల సంవత్సరాలు నిల్వ ఉంటుంది. ప్రకృతి మనకు ప్రసాదించిన ఈ దివ్యమైన ఔషధాన్ని ప్రతిరోజు తగిన పరిమాణంలో ఆహారంగా తీసుకోవడం వల్ల ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ ,యాంటీ వైరల్, యాంటీ ఫంగల్, యాంటీ సెప్టిక్ వంటి ఔషధ గుణాలు మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించి అనేక వ్యాధుల నుండి మనల్ని రక్షిస్తుంది.

ఇంతటి విశిష్ట ఔషధ గుణాలు కలిగిన తేనెను ఆయుర్వేద వైద్యంలో ఎన్నో వ్యాధులకు పరిష్కార మార్గాన్ని చూపుతోంది. అయితే తేనెను సరైన మోతాదులో, సరైన పద్ధతుల్లో ఉపయోగిస్తే మన ఆరోగ్యాన్ని రక్షిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.లేదంటే తీవ్ర అనారోగ్యానికి కారణం కావచ్చు. తేనెను వాడే విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు ఏ ఏ పదార్థాలతో కలిపి తినకూడదు వంటి విషయాలను గురించి తెలుసుకుందాం.

తేనెను శుద్ధి చేయకుండా వినియోగిస్తే తేనెలో బొటులినియం ఎన్దోసపొర్స్ అనే సూక్ష్మజీవులు, తుతిన్ అనే విష పదార్థం మన ఆరోగ్యానికి కొంత హాని కలిగించవచ్చు. ముఖ్యంగా ఒక సంవత్సరం లోపు పిల్లలకు తేనెను అస్సలు తినిపించకూడదు.తేనెను వేడి చేయడం, వేడి పదార్థాలతో కలిపి తినడం,
మరిగించడం, ఫ్రిజ్లో పెట్టడం వంటివి చేస్తే తేనే సహజ ఔషధ గుణాలను కోల్పోయి మన ఆరోగ్యం పై వ్యతిరేక ప్రభావాన్ని చూపించవచ్చు.

తేనెను నెయ్యి పదార్థాలలు, మసాలా పదార్థాలు, మిరియాలు, ఆవనూనె, ఆల్కహాల్ లో కలిపి ఆహారంగా తీసుకోవడం వల్ల తీవ్ర అనారోగ్యానికి కారణం అవుతుంది. తేనెకు మన శరీరంలో వేడిని కలగజేసే గుణం ఉంది. కావున మన శరీరానికి చల్లదనాన్ని కల్పించే దోసకాయ, ముల్లంగి, శీతల పానీయాల్లో తేనెను కలిపి వాడడం ఈ రెండిటి వ్యతిరేక స్వభావం వల్ల కడుపుమంట, అజీర్తి, గ్యాస్టిక్ వంటి జీర్ణ సంబంధిత వ్యాధులతో బాధపడతారు.