శీతాకాలంలో ఉసిరికాయను ఎక్కువగా తింటున్నారా? ఈ విషయాలను గ్రహించండి!

శీతాకాలంలో అత్యల్ప ఉష్ణోగ్రతల కారణంగా శరీర జీవక్రియ రేటు మందగించి మనలో వ్యాధి నిరోధక శక్తి కొంత లోపిస్తుంది దాంతో అనారోగ్య సమస్యలు తలెత్తి అలసట నీరసం చికాకు ఒళ్ళు నొప్పులు వంటి అనేక ఇబ్బందులు కలుగుతాయి. దానికి తోడు తడి వాతావరణం కారణంగా ప్రమాదకరస్థాయిలో బ్యాక్టీరియా, వైరస్,ఫంగల్ ఇన్ఫెక్షన్లు మన ఇమ్యూనిటీ సిస్టంపై దాడి చేసి మన ఆరోగ్యాన్ని మరింత క్షీణింప చేస్తాయి. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని మన రోజువారి ఆహారంలో ఇమ్యూనిటీ శక్తిని పెంపొందించే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ మైక్రోబియన్ గుణాలు పుష్కలంగా లభించే ఆహారాన్ని ఎక్కువగా తినాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.

ముఖ్యంగా శీతాకాలంలో ఎక్కువగా లభించే ఉసరి కాయలను తరచూ మన ఆహారంలో ఉపయోగిస్తే బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు. ఉసరి కాయలో సమృద్ధిగా విటమిన్ సి, విటమిన్ ఏ, ఫైబర్, కాల్షియం, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబియల్ గుణాలు సమృద్ధిగా లభిస్తున్నాయి. కావున సీజనల్గా వచ్చే అన్ని రకాల ఇన్ఫెక్షన్లను అలర్జీలను నియంత్రించే గుణం మన శరీరంలో అభివృద్ధి చెందుతుంది.

సిట్రస్ జాతికి చెందిన నిమ్మ ,ఆరంజ్ పండ్లలో కంటే ఉసిరిలో అత్యధిక విటమిన్ సి లభ్యమవుతుంది. ఉసరిలో అత్యధికంగా ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరిచి మలబద్ధకం, అజీర్తి వంటి సమస్యలను తొలగిస్తుంది. ఉసరిలో ఉండే విటమిన్ ఏ యాంటీ ఆక్సిడెంట్ కంటి చూపు ను మెరుగుపరుస్తుంది, చర్మం లోని ముడతలను తగ్గించి వృద్ధాప్య ఛాయాలను అరికడుతుంది. ఉసరిలో అత్యధికంగా లభించే ఫైబర్, క్రోమియం ఇన్సులిన్ ఉత్పత్తిని అధికం చేసి రక్తంలో గ్లూకోస్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. అధిక శరీర బరువుతో బాధపడేవారు ఉసరి కషాయాన్ని సేవిస్తూ శరీరంలోని మలినాలు తొలగి సహజ పద్ధతిలో శరీర బరువును నియంత్రించుకోవచ్చు. శీతాకాలంలో ఎక్కువగా ఇబ్బంది పెట్టి యూరిన్ ఇన్ఫెక్షన్ తగ్గించడంలో సహాయపడుతుంది.