Lemon in fridge: ఫ్రిజ్ లో నిమ్మకాయ ముక్క కోసి ఉంచితే.. ఏమవుతుందో తెలుసా..!

ఇంట్లో ఎంత శుభ్రత పాటించినా ఫ్రిజ్‌ లోనుంచి వచ్చే దుర్వాసన చాలా మందికి తలనొప్పి తెప్పిస్తుంది. కూరగాయలు, మిగిలిన ఆహారం, పాలు లేదా మాంసాహార పదార్థాల వాసన కలిసిపోయి ఫ్రిజ్‌లో విచిత్రమైన వాసన వస్తుంది. అలాంటి సమస్యను సులభంగా పరిష్కరించే సహజమైన మార్గం ఒకటుంది ఉంది. అది మనందరికీ తెలిసిన అందుబాటులో ఉన్న పదార్థమే.. అదే నిమ్మకా. నిపుణుల చెబుతున్న వివరాల ప్రకారం, నిమ్మకాయ ముక్కలను ఫ్రిజ్‌లో ఉంచితే ఆహారం తాజాగా ఉండటమే కాకుండా ఫ్రిజ్ శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంటుందంట..

నిమ్మకాయలో ఉండే సిట్రిక్ యాసిడ్, యాంటీబాక్టీరియల్ లక్షణాలు ఫ్రిజ్‌లోని గాలిని పరిశుభ్రం చేస్తాయి. దుర్వాసనను నిమ్మకాయ సహజంగానే గ్రహించి తొలగిస్తుంది. ఫ్రిజ్ తెరిచినప్పుడల్లా వచ్చే తాజా వాసన ఇంటి వాతావరణాన్నే మార్చేస్తుంది. దీనివల్ల ఫ్రిజ్‌లో నిల్వ చేసిన ఆహారం చెడిపోవడాన్ని కూడా తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మాంసాహార వంటకాలను ఉంచే కుటుంబాల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. అలాంటి సందర్భాలలో నిమ్మకాయ ముక్కలే సహజ రక్షకులుగా మారతాయి. నిమ్మకాయలోని యాంటీఆక్సిడెంట్లు ఆహారం చెడిపోకుండా నిరోధిస్తాయి. దీంతో కూరగాయలు, పండ్లు మరింత కాలం తాజాగా నిలుస్తాయి.

ఇంకా ఒక ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, ఫ్రిజ్‌లో ఉంచిన నిమ్మకాయ ముక్కలు గాలిలో వ్యాప్తిచేసే సూక్ష్మక్రిములను కూడా తగ్గిస్తాయి. ఇది కుటుంబ సభ్యుల ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఆహారంలో ఉండే ఇన్ఫెక్షన్ల ప్రమాదం తగ్గిపోవడంతో కడుపు సంబంధిత సమస్యలు తక్కువగా వస్తాయి. అందుకే నిపుణులు తరచుగా ఫ్రిజ్‌ను శుభ్రం చేయడమే కాకుండా సహజ రీతిలో దానిని తాజాగా ఉంచే ప్రయత్నాలు చేయాలని సూచిస్తున్నారు. నిమ్మకాయల వాసన మనసుకు హాయిని అందించడమే కాకుండా ఇంటి వాతావరణాన్ని కూడా ఆరోగ్యకరంగా మార్చగలదు. చిన్న చిట్కా అయినా పెద్ద ప్రయోజనం అందించే ఈ పద్ధతి నేడు అనేక కుటుంబాల్లో సహజ పరిష్కారంగా మారుతోందని చెబుతున్నారు.