ఫ్రీజర్ లో ఐస్ గడ్డ కట్టడానికి ప్రధాన కారణం ఫ్రిజ్ డోర్ గ్యాస్కెట్ చెడిపోవడం, ఫిల్టర్ సరిగా పనిచేయకపోవడం, అధిక తేమ మరియు ఫ్రీజర్ ఓవర్లోడింగ్ అని చెప్పవచ్చు. ఈ సమస్యను నివారించడానికి, తలుపులు సరిగ్గా మూసివేయడం, ఫిల్టర్‌ను శుభ్రం చేయడం, ఫ్రీజర్‌ను ఓవర్‌లోడ్ చేయకుండా చూసుకోవడం మరియు తేమను నియంత్రించడం చేయాల్సి ఉంటుంది.
ఫ్రిజ్ తలుపు లేదా రబ్బరు పట్టీ దెబ్బతిన్నట్లయితే, బయటి గాలి లోపలికి ప్రవేశించి ఐస్ ఏర్పడడానికి సహాయపడుతుంది. ఫిల్టర్ సరిగా పనిచేయకపోతే, నీటిలో ఉండే ఖనిజాలు మంచుగా ఏర్పడతాయి, ఇది ఫ్రిజ్‌లోని అన్ని వస్తువులను స్తంభింపజేస్తుంది. ఫ్రీజర్ అధికంగా నిండిపోయినప్పుడు, చల్లని గాలి ప్రసరణకు ఆటంకం ఏర్పడుతుంది, ఇది మంచు ఏర్పడటాన్ని వేగవంతం చేస్తుంది. ఫ్రీజర్ తలుపు తెరిచిన ప్రతిసారీ, వెచ్చని గాలి ప్రవేశించి మంచు ఏర్పడటానికి సహాయపడుతుంది.
ఫ్రీజర్ తలుపు తెరిచిన ప్రతిసారీ, వెచ్చని గాలి ప్రవేశించి మంచు ఏర్పడటానికి సహాయపడుతుంది. ఫ్రీజర్ ఉష్ణోగ్రతను చాలా ఎక్కువగా లేదా చాలా తక్కువగా సెట్ చేయడం వల్ల అదనపు మంచు ఏర్పడి త్వరగా పేరుకుపోతుంది. తరచూ తొలగించినా ఫ్రీజర్ నిండా ఐస్ గడ్డల్లాగా ఏర్పడుతూ.. ఆ ప్లేస్ మొత్తం ఆక్రమిస్తుంటుంది. అయితే, దీన్ని అలాగే వదిలేస్త్ అందులో స్టోర్ చేసుకునే ఆహార పదార్థాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశాలే ఎక్కువ అని సూచిస్తున్నారు.
సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ తరచూ ఈ సమస్యలను ఎదుర్కొంటూ ఉంటుంది. ఫ్రిజ్ లేకపోతే ఇప్పటి రోజుల్లో కురగాయలు, పండ్లు, పాలు నిల్వచేయడం చాలా కష్టంతో కూడుకున్న పని. ఇక ప్రతి ఇంట్లోనూ ఫ్రిజ్ అనేది సర్వసాధారణ వస్తువైపోయింది. బీదా, గొప్ప బేధం లేకుండా ప్రతి ఒక్కరికీ ఫ్రిజ్ కావాల్సిన వస్తువే. అయితే ఫ్రిజ్ ని ఇన్నేళ్ళుగా వాడేస్తున్నాం. ఫ్రిజ్ న్విషయంలో పొరపాట్లు చేస్తే రిపేర్ కోసం ఎక్కువ మొత్తం ఖర్చు చేయాల్సి వస్తుంది.