శనిదోషంకు పాటించాల్సిన పరిహారాలు ఇవే.. ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?

మనలో చాలామంది శని దోషం వల్ల నిత్యజీవితంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. అయితే కొన్ని ప్రత్యేక పూజలు చేయడం ద్వారా ఈ చిత్రం దోషం నుంచి సులువుగా ఉపశమనం పొందవచ్చు. శని దోషం వల్ల బాధపడే వాళ్ళు కొన్ని చిట్కాలను పాటిస్తే మంచిది. శనివారం రోజున శని దేవునికి ప్రత్యేక పూజలు చేయడం ద్వారా అనుకూల ఫలితాలను పొందవచ్చు. శని మంత్రాలను జపించడంతోపాటు నువ్వుల నూనెతో అభిషేకం చేయడం కూడా అనుకూల ఫలితాలను ఇస్తుంది.

శనివారం రోజున పూజ చేయాలని భావించేవాళ్లు శని విగ్రహానికి అభిషేకం చేసి మంత్రాలను జపించడంతోపాటు శని చాలీసా పారాయణం కూడా చేయాలి. శని దోషం వల్ల బాధపడుతున్న వాళ్లు హనుమంతుడిని పూజించడం ద్వారా సత్ఫలితాలు చేకూరుతాయి. ఎవరైతే హనుమాన్ చాలీసా చదువుతారు వారిపై శని ప్రభావం తగ్గుతుందని పండితులు చెబుతున్నారు.

శనివారం రోజున రావి చెట్టుకు నీళ్లు పోసి పూజ చేసి ఆ తర్వాత ప్రదక్షిణలు చేయాలి. రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపం వెలిగించడం ద్వారా కూడా అనుకూల ఫలితాలు వస్తాయి. శనివారం రోజున పేదలకు సహాయం చేయడంతో పాటు వాళ్ళ అవసరాలను తీర్చడం ద్వారా దానధర్మాలు చేయడం ద్వారా శని దోషం తగ్గే ఛాన్స్ అయితే ఉంటుంది. నూనె నల్ల నువ్వులు నల్లటి వస్త్రాలు దానం చేయడం ద్వారా మంచి జరుగుతుంది.

శని దోషం వల్ల తీవ్రంగా ప్రభావితం అవుతుంటే మాత్రం ప్రతి శనివారం రోజున శని మంత్రమైన ఓం శం శనిచారాయ నమః మంత్రాన్ని 108 సార్లు జపించాలి. శని దోషం ఉన్నవాళ్లు శివుడిని ఆరాధించడంతోపాటు శివునికి అభిషేకం చేయాలి. శని దోషం ఉన్నవాళ్లు ఇంటి నుంచి బయటకు వెళ్లే సమయంలో గుమ్మంపై నల్ల మిరియాలు పెట్టి తొక్కడం ద్వారా కూడా మంచి జరిగే అవకాశాలు ఉంటాయి. భక్తిశ్రద్ధలతో శని దేవుడిని పూజించడం ద్వారా శని దోషం తొలగిపోయి అంతా మంచి జరుగుతుంది. ఈ పరిహారాలు పాటించడం ద్వారా కష్టాలు తొలగిపోవడంతో పాటు జీవితంలో ఏ పని చేసిన అనుకూల ఫలితాలు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది.