జుట్టు ఒత్తుగా పెరగడానికి కొన్ని ఇంటి చిట్కాలు పాటిస్తే మంచిది. కొబ్బరి నూనె, బాదం నూనె లేదా ఆలివ్ నూనె వంటి వాటితో తలకు మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుందని చెప్పవచ్చు. ఈ విధంగా చేస్తే జుట్టు కుదుళ్లకు పోషణ అండడంతో పాటు జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. మీ ఆహారంలో ప్రొటీన్లు, విటమిన్లు, ఖనిజాలు ఉండేలా చూసుకుంటే ఆరోగ్యానికి మంచిదని చెప్పవచ్చు.
విటమిన్ బి7 (బయోటిన్), విటమిన్ డి, ఐరన్, జింక్ మరియు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ జుట్టు పెరుగుదలకు చాలా అవసరం అని చెప్పవచ్చు. జుట్టును ఎక్కువగా వేడి చేయకుండా, కెమికల్స్ ఉన్న షాంపూలు, ఇతర ఉత్పత్తులను వాడకుండా జాగ్రత్తపడాలి. వారానికి ఒకటి లేదా రెండుసార్లు హెయిర్ మాస్క్ వేసుకోవడం మంచిదని చెప్పవచ్చు.
శరీరంలో తగినంత నీరు ఉంటే జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది, కాబట్టి రోజూ తగినంత నీరు త్రాగడం ముఖ్యం. ఒత్తిడి వల్ల జుట్టు రాలడం పెరుగుతుంది, కాబట్టి ఒత్తిడిని తగ్గించే పద్ధతులు పాటించాలి. సోంపు గింజలను నీటిలో మరిగించి, ఆ నీటితో జుట్టును కడిగితే, జుట్టు రాలడం తగ్గడంతో పాటు ఒత్తుగా పెరుగుతుంది. పెరుగులో విటమిన్ ఇ కలిపి రాసుకుంటే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. గుడ్లు, ఉసిరి కూడా జుట్టుకు మంచివి.
తలకి రెగ్యులర్ గా మసాజ్ చేయడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడటంతో పాటు జుట్టు కుదుళ్ళు బలంగా పెరుగుతాయి. జుట్టు పెరుగుదలకి ఆయిల్ మసాజ్ హెల్ప్ చేస్తుందని చెప్పవచ్చు. జుట్టు ఆరోగ్యంగా పెరగాలంటే తల చర్మం ఆరోగ్యంగా ఉండాలి. ముఖ్యంగా తల చర్మంలో రక్త ప్రసరణ బాగుండాలి. దీనికోసం స్కాల్ప్ కు రెగ్యులర్ గా మసాజ్ చేసుకుంటూ ఉండాలి