అరటి పండు వల్ల కలిగే అనారోగ్య సమస్యలు ఏంటో తెలుసా?

పండ్లు, పండ్ల రసాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పండ్లలోని ఎన్నో రకాల పోషకాలు మన ఆరోగ్యానికి చాలా అవసరం. ముఖ్యంగా సీజన్ తో సంబంధం లేకుండా ఎలాంటి సీజన్లో లభించే పండులో అరటిపండు ఒకటి. అతి తక్కువ ధరలో సామాన్యుడికి కూడా లభిస్తుంది. అరటిపండు తినడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో, అవి ఎక్కువగా తినటం వల్ల కూడా నష్టాలు ఉన్నాయి. అరటిపండు రుచికి చాలా బాగుంటుంది. అరటిపండుని ఇష్టపడనివారు ఉండరని చెప్పటంలో సందేహం లేదు. అరటి పండ్లు ఎన్నో పోషకాలు ఉన్నప్పటికీ అరటి పండును అతిగా తినడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఇప్పుడు మనం వాటి గురించి తెలుసుకుందాం.

సహజంగా అరటి పండ్లు తింటే తిన్న ఆహారం తొందరగా అరుగుతుంది అంటారు.రోజుకు ఒకటి లేదా రెండు కంటే ఎక్కువ అరటి పండ్లు తింటే దానిలోని పీచు పదార్థం వల్ల ఆహారం అరగక జీర్ణకోశ సంబంధిత వ్యాధులు వస్తాయి. కడుపు నొప్పి, గ్యాస్ట్రిక్ సమస్యలు సంభవించే ప్రమాదం ఉంది. అరటి పళ్ళు ఎక్కువగా తినటం వల్ల అందులోని అమైనో ఆమ్లం తలనొప్పికి దారి తీస్తుంది. అరటిపండు ఎక్కువగా తినటం వల్ల అధిక బరువు సమస్య ఇంకా పెరగవచ్చు. అరటి పండ్లు ఎక్కువగా తింటే అందులోని ఫైబర్ కంటెంట్ వల్ల కడుపునిండిన అనుభూతి వల్ల ఆహారం తీసుకోలేరు. ప్రతిఫలంగా గ్యాస్ట్రిక్ సమస్యలు తలెత్తుతాయి.

అరటిపండులో విటమిన్ బి6 పుష్కలంగా ఉంటుంది. అందువలన అరటి పండు ఎక్కువగా తినటం వల్ల నరాల బలహీనత సమస్య ఏర్పడుతుంది. ఆస్తమాతో బాధపడేవారు అరటి పండును ఎక్కువ తినకూడదని డాక్టర్లు సూచిస్తున్నారు. కొద్దిమందికి అలర్జీ ఉండటంవల్ల వారి శరీర తత్వాన్ని బట్టి అరటిపండు తినకపోవడమే ఆరోగ్యానికి మంచిది.