షుగర్ వ్యాధి అదుపులో ఉండాలంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎంత మోతాదులో ఉండాలో తెలుసా?

diabetes-measure

షుగర్ వ్యాధితో బాధపడే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.షుగర్ వ్యాధి నియంత్రణలోకి తీసుకురావడానికి శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు చేస్తున్న కృషి ఫలించలేదని చెప్పొచ్చు.షుగర్ వ్యాధి చాప కింద నీరులా శరీరంలో ఒక్కో అవయవాన్ని క్షీణింప చేస్తూ చివరకు అత్యంత ప్రమాదకరంగా మారుతుంది. చాలామందిలో షుగర్ వ్యాధి సోకిందన్న విషయం తెలిసేలోపే జరగాల్సిన నష్టం పూర్తిగా జరిగిపోతుంది. షుగర్ వ్యాధి రావడానికి గల కారణాలను పరిశీలిస్తే మారుతున్న ఆహారపు అలవాట్లు,శారీరక శ్రమలోపించడం వంటివి ప్రధానంగా చెప్పొచ్చు.

షుగర్ వ్యాధి ప్రమాదాన్ని ఎదుర్కోవాలంటే మొదట వ్యాధి పట్ల పూర్తి అవగాహన పెంచుకోవాలి, క్రమశిక్షణ కలిగిన ఆహార నియమాలు పాటించాలి, శారీరక శ్రమ కలిగిన వ్యాయామం,నడక,యోగ, ధ్యానం, సైక్లింగ్, స్విమ్మింగ్, డాన్స్ వంటివి అలవాటు చేసుకోవాలి.షుగర్ వ్యాధి లక్షణాలు మొదట
కళ్ళు ,కిడ్నీ అవయవాల్లో స్పష్టంగా కనిపిస్తాయి. ఏమాత్రం అనుమానం వచ్చిన వైద్య సలహాలు తీసుకొని షుగర్ టెస్ట్ చేయించుకోవాలి.

ఫాస్టింగ్ బ్లడ్ షుగర్100 ఎంజి/డిఎల్ ఉంటే నార్మల్,
ఫాస్టింగ్ బ్లడ్ షుగర్100 నుండి 126 ఎంజి/డిఎల్ ఉంటే ఫ్రీ డయాబెటిస్ స్టేజ్ లో ఉన్నట్టు గ్రహించుకోవాలి. అదే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ 126ఎంజి/డిఎల్ కంటే ఎక్కువగా ఉంటే మీరు షుగర్ వ్యాధి బారిన పడినట్లే లెక్క. అలాగే ఏహ్ బీ ఏ 1సి టెస్ట్ లో 5.7 శాతం వరకు నార్మల్,5.7 శాతం నుంచి6.4 శాతం వరకు ఫ్రీ డయాబెటిస్,6.5 శాతం ఉంటే డయాబెటిస్ ఉన్నట్లే. భోజనం చేసిన రెండు గంటల తర్వాత బ్లడ్ షుగర్140 ఎంజి/డిఎల్ దాటితే షుగర్ ఉన్నట్లు వైద్యులు సూచిస్తారు.