మునగాకు వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలివే.. ఇన్ని సమస్యలు దూరమవుతాయా?

మనలో చాలామంది మునగకాయలను ఎంతో ఇష్టంగా తింటారు. అయితే మునగ ఆకుల వల్ల కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. మునగ ఆకుతో ఏకంగా 300 ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టే అవకాశాలు అయితే ఉంటాయని తెలుస్తోంది. మునగాకుల ద్వారా మన శరీరానికి అవసరమైన ఎ, సి విటమిన్లు లభించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. మునగాకు తీసుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన కాల్షియం, పాస్పరస్, ఐరన్ కూడా లభించే ఛాన్స్ ఉంటుంది.

ఆయుర్వేదంలో మునగాకు ద్వారా 300కు పైగా వ్యాధులకు చెక్ పెట్టే అవకాశాలు అయితే ఉంటాయి. విటమిన్స్, ఎమినో యాసిడ్స్, మినరల్స్ సమృద్ధిగా ఉన్న మునగాకు వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎన్నో బెనిఫిట్స్ పొందవచ్చు. క్యారెట్ తో పోల్చి చూస్తే పది రెట్లు ఎక్కువగా ఎ విటమిన్ మునగాకు ద్వారా లభిస్తుంది. మునగాకును తీసుకోవడం ద్వారా శరీరానికి కావాల్సిన క్యాల్షియం, ప్రోటీన్లు లభించే ఛాన్స్ ఐతే ఉంటుంది.

మునగాకు ద్వారా శరీరానికి ఎంతో అవసరమైన పొటాషియం కూడా లభిస్తుంది. 7 గ్రాముల మునగాకు పొడిని 3 నెలల పాటు రెగ్యులర్‌గా తీసుకోవడం ద్వారా బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గే ఛాన్స్ అయితే ఉంటుంది. మునగాకు తీసుకోవడం ద్వారా థైరాయిడ్ తగ్గుతుంది. మునగాకులో ఉండే క్లోరోజెనిక్ యాసిడ్ బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ను అదుపులో ఉంచుతుంది.

గర్భిణులు, బాలింతలకు అవసరమైన కాల్షియం, ఐరన్, విటమిన్లు మునగాకు ద్వారా పుష్కలంగా లభిస్తాయి. మునగాకు తీసుకుంటే పాలిచ్చే తల్లులకు పాలు పెరుగుతాయి. వంద మిల్లీలీటర్ల నీటిలో మునగాకులను వేసి కొంచెం ఉప్పు, మిరియాలపొడి, నిమ్మరసం కలిపి తాగడం ద్వారా ఆస్తమా, టీబీ, దగ్గు తగ్గే అవకాశాలు అయితే ఉంటాయి. కొబ్బరి నీళ్లలో మునగాకు రసం వేసి తాగితే విరోచనాలు తగ్గే ఛాన్స్ అయితే ఉంటుంది.