కాళ్లు, చేతుళ్లలో తిమ్మిర్లు పడుతున్నాయా.. తిమ్మిర్ల సమస్యకు చెక్ పెట్టే అద్భుతమైన చిట్కాలివే!

మనలో చాలామందిని ఏదో ఒక సందర్భంలో తిమ్మిర్లు వేధిస్తుంటాయి. ఈ సమస్య చిన్న సమస్యలా అనిపించినా ఈ సమస్య వల్ల ఎదురయ్యే ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. కాళ్లు, చేతుళ్లను అదే పనిగా కదలకుండా ఉంచితే తిమ్మిర్లు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. రక్తం సరఫరాలో అడ్డంకులు ఏర్పడటం వల్ల ఈ విధంగా జరుగుతుంది. తరచూ తిమ్మిర్ల సమస్య వేధిస్తుంటే మాత్రం జాగ్రత్త పడాల్సిందేనని చెప్పవచ్చు.

తిమ్మిర్ల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే దీర్ఘకాలంలో ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. తిమ్మిర్లు ఎక్కువైతే ఆ లక్షణం శరీరంలోని తీవ్రమైన వ్యాధులకు సంకేతం అని గుర్తుంచుకోవాలి. రక్తంలో షుగర్ లెవెల్స్ పెరగడం వల్ల కూడా కొన్నిసార్లు చేతులు, కాళ్లు తిమ్మిరికి గురయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. కడుపులో బిడ్డ పెరుగుతున్న సమయంలో వచ్చే అదనపు ద్రవాలు నరాలపై నొక్కడం వల్ల కూడా తిమ్మిర్లు వస్తాయి.

చర్మం వదులుగా మారిన బొడ్డు ప్రాంతంలో సైతం తిమ్మిర్లు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ప్రసవం తర్వాత కూడా తిమ్మిర్లు అలాగే ఉంటే మాత్రం వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలి. వెన్నెముకలో జారిన డిస్క్ కూడా కొన్నిసార్లు తిమ్మిర్లకు కారణమయ్యే ఛాన్స్ ఉంటుంది. తిమ్మిర్ల సమస్యతో బాధ పడేవాళ్లు తీసుకునే ఆహారంలో కూడా తగిన మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది.

దీర్ఘకాలిక వ్యాధులను తగ్గించడానికి వాడే మందులు సైతం తిమ్మిర్లకు కారణమయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. కిడ్నీలు సక్రమంగా పని చేయకపోయినా తిమ్మిర్లు వచ్చే ఛాన్స్ ఉంటుందని తెలుస్తోంది. ఎక్కువగా మద్యం తీసుకున్నా, థైరాయిడ్ తో బాధ పడుతున్నా తిమ్మిర్ల సమస్య వచ్చే అవకాశం అయితే ఉంటుంది.