మెడ నొప్పి సమస్యతో తరచూ బాధ పడుతున్నారా.. ఈ సమస్యకు సులువుగా చెక్ పెట్టే చిట్కాలివే!

మనలో చాలామందిని ఏదో ఒక సందర్భంలో మెడనొప్పి సమస్య వేధిస్తుంది. మెడనొప్పి సాధారణ సమస్యే అయినా తరచూ ఈ సమస్య వేధిస్తుంటే మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. మెడ దగ్గర నొప్పి వస్తే కొంతమంది ట్యాబ్లెట్లు వాడితే మరి కొందరు బామ్ లను వాడతారు. మెడ దగ్గర ఉండే వెన్నెముకలో ఏడు వెన్నెపూసలు ఉండగా మనం సరిగ్గా కూర్చోకపోవడం, నిల్చోకపోవడం వల్లే ఈ సమస్య వస్తుంది.

డిస్క్ జారి నరాల మీద ఒత్తిడి పడిన సమయంలో రక్త ప్రసరణకు సంబంధించి ఇబ్బందులు ఎదురైతే నొప్పి తీవ్రమవుతుంది. మెడ నొప్పి తీవ్రంగా ఉన్న సమయంలో పెద్దపెద్ద బరువులు మోయడం ఆరోగ్యానికి మంచిది కాదు. కీళ్ళ నొప్పులు ఉన్నవారికి కూడా వెన్ను సంబంధిత సమస్యలు వస్తాయి. జీవన విధానం బాగుండేలా చూసుకోవడం ద్వారా వెన్నునొప్పికి సంబంధించిన సమస్యలకు చెక్ పెట్టవచ్చు.

మెడనొప్పి మరీ ఎక్కువగా ఉంటే మాత్రం నిర్లక్ష్యం చేయడం మంచిది కాదు. ఎక్స్ రే స్కానింగ్ ద్వారా మెడనొప్పికి సంబంధించిన సమస్యలు ఉంటే తెలుసుకోవచ్చు. ఫిజికల్ యక్టివిటీ ద్వారా మెడ నొప్పి సమస్యకు చెక్ పెట్టవచ్చు. కీబోర్డు మోచేతుల కంటే కింద ఉండేలా చూసుకోవడం ద్వార ఈ సమస్య రాకుండా జాగ్రత్త పడవచ్చు. యోగా, ఎక్సర్‌సైజ్ తరచూ చేయడం ద్వారా కూడా సమస్య దూరమవుతుంది.

స్ట్రెచ్ థెరపీ చేయడం ద్వారా కూడా ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది. వేడినీటితో కాపరం పెట్టడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. అల్లం, తేనెలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉండగా నొప్పిని దూరం చేయడంలో ఇవి తోడ్పడతాయి. పింక్ సాల్ట్‌తో కాపరం పెట్టడం ద్వారా నొప్పి తగ్గుతుంది.