Home Health & Fitness ఉదయం 8:30 తర్వాత బ్రేక్ ఫాస్టా..!? డయాబెటిస్ ముప్పంటున్న నిపుణులు..!!

ఉదయం 8:30 తర్వాత బ్రేక్ ఫాస్టా..!? డయాబెటిస్ ముప్పంటున్న నిపుణులు..!!

కొందరు రోజూ ఉదయం నిద్ర లేచి రెడీ అయ్యేసరికే 9 అవుతుంది. ఇక బ్రేక్ ఫాస్ట్ తీసుకునేదెప్పుడు? మరికొందరు 8కే రెడీ అయి 9లోపే బ్రేక్ ఫాస్ట్ ముగిస్తారు. మరికొందరు ఆఫీసులకు వెళ్లి 9-10 మధ్యలో బ్రేక్ ఫాస్ట్ చేస్తారు. కానీ.. ఇవేమీ కాదు.. ఉదయం 8:30లోపే బ్రేక్ ఫాస్ట్ చేసేయాలంటున్నారు నిపుణులు. అయితే.. అప్పటికి ఇంట్లో టిఫిన్ రెడీ చేయగలగాలి. ఇది సమస్యే. ఇంటి పనుల్లో భాగంగా ఉదయాన్నే లేచి పనులు ప్రారంభించే మహిళలు టిఫిన్ తోపాటు భోజనం కూడా సిద్ధం చేయాల్సి ఉంటుంది. వారి సమస్య అర్ధం చేసుకోదగినదే. కానీ.. ఆరోగ్యం కోసం డయాబెటిస్ బారిన పడకుండా ఉండాలంటే మాత్రం 8:30లోపు బ్రేక్ ఫాస్ట్ చేయాల్సిందే అంటున్నాయి పరిశోధనలు.

Indian Breakfast | Telugu Rajyam

ఉదయం 8:30 తర్వాత తీసుకునే బ్రేక్ ఫాస్ట్ ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు నిపుణులు. ఈ విషయాల్ని ENDO 2021లో ప్రచురితమయ్యాయి. కొందరిపై జరిపిన అధ్యయనాల్లో బ్రేక్‌ఫాస్ట్ తీసుకొనే వేళలపై కొన్ని కీలక విషయాలు వెల్లడించింది ఎండోక్రైన్ సొసైటీ. ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవడం వల్ల టైప్-2 డయాబెటీస్ ముప్పు ఉండదట. ఉపవాసం ఉండటంపై జరిపిన అధ్యయనంలో పరిశోధకులు ఈ విషయాన్ని తెలుసుకున్నారని అంటోంది. వీరి రక్తంలో చక్కెర స్థాయిలు తక్కువగా ఉండటంతోపాటు తక్కువ ఇన్సులిన్ నిరోధకత ఉన్నట్లు నిపుణులు గుర్తించారట. అమెరికాలోని నేషనల్ సర్వే ఆన్ హెల్త్ అండ్ న్యూట్రీషన్ 10,575 మందిపై కొన్ని పరిశోధనలు జరిపారు.

 

ఈ పరిశోధనల్లో బ్రేక్ ఫాస్ట్ తీసుకునే వేళలు, బ్లడ్, షుగర్, ఇన్సులిన్ లెవల్స్ ను పరిశీలించారు. ఉపవాసం ఉండేవారు, 10 తర్వాత టిఫిన్ చేసేవారిలో అధిక ఇన్సులిన్ నిరోధకత ఉన్నట్లు కనుగొన్నారు. ఇది బ్లడ్, షుగర్ స్థాయిలను నియంత్రించి టైప్-2 డయబెటీస్ కు కారణమవుతుంది. ఇన్సులిన్ నిరోధకత పెరిగే కొద్దీ డయాబెటీస్ ముప్పు పెరిగినట్టేనని నిపుణులు అంటున్నారు. ఉదయాన్నే 8.30కు ముందే బ్రేక్‌ఫాస్ట్ చేస్తే బ్లడ్ షుగర్ స్థాయిలు తక్కువగా ఉంటాయని అంటున్నారు. పోషకాలు, ప్రోటీన్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులతో కూడిన ఆహారాన్ని తీసుకోవడం మంచిదంటున్నారు. జీవక్రియకు కూడా మేలు చేసేలా పండ్లు, గుడ్లు, పెరుగు, కూరగాయలు లేదా గోదుమలతో తయారు చేసిన ఆహారం ఉత్తమమని కూడా అంటున్నారు.

గమనిక: ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఆయా సందర్భాల్లో నిపుణులు తెలిపిన సమాచారం మేరకే ఈ కథనం అందించాం. మీ ఆరోగ్యం కోసం వైద్యులు, ఆరోగ్య నిపుణులను సంప్రదించి.. వారి సలహాలను పాటించాలని కోరుతున్నాం.

 

 

- Advertisement -

Related Posts

షడ్రుచుల ‘ఉగాది పచ్చడి’ ఆరోగ్యానికి ఎంతో మేలు..!

వేసవి ప్రారంభమయ్యాక వచ్చే ‘ఉగాది’ పండగకు ఎంతో ప్రత్యేకత ఉంది. షడ్రుచుల సమ్మేళనంతో చేసుకునే ఉగాది పచ్చడి మనిషి జీవితాన్ని సృశిస్తుందని అంటారు. తీపి, ఉప్పు, చేదు, పులుపు, వగరు కారం.. ఇలా...

రోగనిరోధక శక్తి పెరగాలంటే ఆహారంలో ఇవి కూడా ఉండాల్సిందే..!!

ప్రస్తుతం కరోనా అందరినీ కలవరపెడుతోంది. దీంతో యోగా, వ్యాయామం, నడక, సైక్లింగ్.. ఆరోగ్యంపై దృష్టి సారిస్తున్నారు. రోగనిరోధక వ్యవస్థను పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజా, పోషకాలు ఉన్న ఆహారం తీసుకుంటున్నారు. దీనివల్ల మన రోగ...

సమ్మర్ బాడీ హీట్ తగ్గాలంటే సబ్జా పడాల్సిందే..!

వేసవి వచ్చిందంటే బాడీ హీటెక్కిపోతూ ఉంటుంది. కాసేపు ఎండలో ఉన్నా చాలు సూరీడి వేడి సెగలా తగులుతుంది. ఇక బయటకు వెళ్తే ఉక్కపోత. నోరు దాహం.. దాహం అంటుంది. శరీరం చల్లదనాన్ని కోరుకుంటుంది....

Latest News