వైయస్ జగన్, ఈ పేరు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత 15 ఏళ్లుగా ప్రతిరోజు వినిపిస్తూనే వుంది. రాజశేఖర్ రెడ్డి 2004లో ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన ఒక సంవత్సరం తర్వాత అంటే 2005 సంవత్సరం నుండి వైయస్ జగన్ అనే పేరు క్రమం తప్పకుండా వార్తల్లో నిలిచేది. మొట్టమొదటిగా పరిటాల రవి హత్యలో వైయస్ జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉందని ఆ మేరకు సిబిఐ విచారణ చేపట్టాలని వైయస్ రాజశేఖర్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని తెలుగుదేశం పార్టీ చాలా ధర్నాలు నిరసనలు బందులు నిర్వహించింది. అయితే ఆ సమయంలో రాజశేఖర్ రెడ్డి సీబీఐ విచారణ వేసి తప్పు ఉంటే జగన్ తప్పక శిక్ష అనుభవిస్తాడు చెప్పి ఆ వివాదానికి తెరదించారు.
ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు చేపట్టిన జలయజ్ఞం భూ కేటాయింపుల్లో వైఎస్ జగన్ కంపెనీలు పెట్టుబడులు పెట్టిన వారికే కాంట్రాక్టులు సెజ్ భూముల కేటాయింపులు జరిగాయి అనేది ప్రధాన ఆరోపణ. సరే వాటికి అటు అసెంబ్లీలోనూ అసెంబ్లీ బయట రాజశేఖర్ రెడ్డి గారు వున్నంతకాలం దీటుగా సమాధానం చెప్పారు. సమాధానం చెప్పడమే కాకుండా తెలుగుదేశం పార్టీని 2009 ఎన్నికల్లో మట్టికరిపించారు కూడా. అయితే అనూహ్యంగా 2009 సెప్టెంబరు 2న రాజశేఖరరెడ్డిగారు చనిపోవడంతో వైఎస్ జగన్ తనదైన శైలిలో రాజకీయం చేయడం ప్రారంభించారు అందులో భాగంగానే ఆయన కాంగ్రెస్ పార్టీ నుండి బయటకు రావలసి వచ్చింది, వచ్చి వైఎస్ఆర్ పేరు మీద ఒక పార్టీ కూడా స్థాపించారు.
ఎప్పుడైతే వైయస్ జగన్ పార్టీ నుండి బయటకు వచ్చారో రాష్ట్రంలో ఒక వర్గం మీడియా టీవీ ఛానళ్లు వైఎస్ జగన్ మీద ఆయన వ్యక్తివం మీద వారికి తోచినట్టు కథనాలు రాయడం మొదలు పెట్టారు. అప్పటికి ప్రజా ప్రతినిధిగా కేవలం ఒక సంవత్సర కాలం మాత్రమే ఉన్న వైయస్ జగన్ గురించి ప్రజలకు గానీ సహచర నాయకులకు గానీ చాలా తక్కువ తెలిసే అవకాశం ఉంది. అయితే జగన్ ని ప్రజలకి ఎక్కువగా పరిచయం చేసింది మీడియానే. రకరకాల కథనాలతో జగన్ అహంభావిగా, ఒక అపరిచితుడుగా, ఒక అవినీతిపరుడిగా. ఒక కోపిష్టిగా పరిచయం చేయడంలో మీడియా చాలా వరకు విజయం సాధించింది. ఆ నేపథ్యంలో 2014లో జరిగిన ఎన్నికల్లో ఈ కథనాల్లో ఎంతో కొంత వాస్తవం ఉందని నమ్మిన ప్రజలు జగన్ కంటే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండడం అవసరమని చంద్రబాబుకి ఒక అవకాశం ఇచ్చారు.
ప్రతిపక్షంలో జగన్ ఉన్నప్పటికీ మీడియా తన ఫోకస్ అంతా జగన్ మీద జగన్ పార్టీ మీదే దృష్టి కేంద్రీకరించి. ఆ పార్టీ త్వరలోనే మూత పడుతుందని జగన్ జైలుకు వెళ్తారని ప్రతి రోజు ఏదో ఒక కథనం తో ముందుకు వచ్చేది. 2019 ఒక వేళ జగన్ అధికారం చేపట్టిన ఎక్కువ కాలం కొనసాగలేదని, జగన్ పాలనలో అవినీతి అక్రమాలు, దౌర్జన్యాలు, రౌడీయిజం తీవ్ర స్థాయిలో ఉంటుందని ప్రజల్లో ఒక భ్రమ కలిగించే కలిగింది మీడియా. అయితే ఈ నేపథ్యంలో అత్యధిక ప్రజాదరణ తో 151 సీట్ల తో గెలిచిన పదవి చేపట్టి నపుడు తలపొగరుతో అరాచకాలు స్రృష్టిస్తాడు ఏడాది తిరగకుండానే భారీగా వ్యతిరేకత తెచ్చుకుంటాడు అని ప్రతిపక్షాల కూడా అంచనావేశాయి.
వైయస్ జగన్ అధికారంలో వున్న ఈ 16 నెలల కాలంలో తాను ఏదైతే హామీలిచ్చారో అవి నెరవేర్చడానికి తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నాడు. అయితే తెలుగుదేశం పార్టీకి ఈ విషయంలో విమర్శించడానికి సరైన పాయింట్అ దొరకడం లేదు. అందుకే ఒక్కోసారి ఈ పథకాలన్నీ మా హయాంలోనే పెట్టామని మరొకసారి ప్రజలకు డబ్బులు పంపిణి చేసి వారిని సోమరిపోతు లాగా తయారు చేస్తున్నారని ఇంకోసారి ఈ పథకాల కోసం అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెడుతున్నాడని పరస్పర విరుద్ధ ప్రకటనలతో కాలయాపన చేస్తున్నారు కానీ ఈ పథకాల్లో అంవినీతి జరిగిందని కానీ అర్హులకు అందలేదని ఆరోపణలను గట్టిగా చేయలేకపోతోంది ప్రతిపక్షం. ప్రజలకి జగన్ డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చారు ఎలా తెచ్చారు అనేది చాలా వరకు సంబంధం లేని విషయం. వారికి అర్హత ఉన్న పథకాలు, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఫలితాలు అందాయి లేదా అనేదే ముఖ్యం.
ఇక రెండో అంశం అవినీతి. జగన్ వస్తే అవినీతి మీరు పోతుందని మీడియా సృష్టించిన ఒక ఇమేజ్ ప్రజల మదిలో అలాగే ఉండిపోయింది. అయితే జగన్ ప్రభుత్వంలో అవినీతి అనేది గత ప్రభుత్వాల కంటే తక్కువ జరిగిందని చెప్పలేకపోవచ్చు ఏమోగానీ ఎక్కువ అయితే మాత్రం జరుగుతున్నట్టు ఈ పదహారు నెల్ల పాలనలో ప్రజలకు అనిపించడం లేదు. ఆ మాటకొస్తే జగన్ వారి ఎమ్మెల్యేల ని బాగా కట్టడి చేశారని ఒక సంకేతమైతే ప్రజల్లోకి పంపించగలిగారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఈ విషయం మీద కొంతమేరకు అసంతృప్తిగా వున్నట్టు మనకు కథనాలు వినిపిస్తున్నాయి.
ఇక మూడో అంశం రౌడీ రాజ్యం. జగన్ వస్తే రౌడీ రాజ్యం వస్తుందని అని మీడియా కల్పించిన అభిప్రాయాన్ని కూడా నిజం కాదని నిరూపించారు. ఎక్కడో కొన్ని చోట్ల చెదురుమదురు సంఘటనలు జరుగుతూ ఉండవచ్చు కానీ రాష్ట్రం అంతా ఏమీ రౌడీరాజ్యం వచ్చి శాంతిభద్రతలు అదుపుతప్పి ఆటవిక రాజ్యం అయితే లేదు. పోలీసు వ్యవస్థగానీ, ఇంటలిజెన్స్ వ్యవస్థగానీ తన పని తాను చేసుకుంటూ వెళుతుంది.
పథకాలు నెరవేర్చడంలో గాని, అవినీతిని అరికట్టడంలో గాని, శాంతి భద్రతలు కాపాడటంలో గాని వైయస్ జగన్ ప్రభుత్వం ప్రతిపక్షాలు వేసుకున్న అంచనాలకు భిన్నంగా ఆ మాటకొస్తే సామాన్య ప్రజానీకం కూడా వైఎస్ జగన్ సామర్థ్యం మీద ఉన్న అపోహలను కూడా ఈ 16 నెలల్లో తొలగించుకో కలిగింది. వైఎస్ జగన్ ప్రభుత్వం ఇక రాబోయే కాలంలో బిజెపి జనసేన నేతృత్వంలో ఇప్పుడిప్పుడే మొదలవుతున్న మత రాజకీయాలను ఎలా ఎదుర్కొంటుందో చూడాలి. ఇప్పటివరకైతే ప్రజల దృష్టిలో వైఎస్ జగన్ ప్రభుత్వం అయినట్టే లెక్క.