వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నేతగా వున్న సమయంలో అనర్గళంగా ప్రసంగించేవారు.! కానీ, ఇప్పుడేమయ్యింది.? పేపర్ స్లిప్ లేకుండా ఆయన బహిరంగ సభల్లో మాట్లాడలేకపోతున్నారు. ఆయన ఏం మాట్లాడినా అందులో ఏదో ఒక పొరపాటు దొర్లుతోంది.
తాజాగా, ‘కాపురం’ అనే మాట వైఎస్ జగన్ నోటి నుంచి వచ్చింది. సాధారణంగా కొత్తగా పెళ్ళయినవారి గురించి ప్రస్తావించేటప్పుడు ‘కాపురం’ అనే మాట వాడుతుంటారు. సరే, వైఎస్ జగన్ నోట వచ్చిన ‘కాపురం’ అనే మాటకి అంత పెద్ద అర్థం తీయాల్సిన అవసరం లేదన్నది వేరే అంశం.
కానీ, జరుగుతున్న ట్రోలింగ్ వైసీపీ స్థాయిని తగ్గిస్తోంది. ‘ప్రజల్ని నమ్ముకుని, ప్రజల కోసమే బతుకుతున్నవారికి.. మీ బిడ్డకీ మధ్య యుద్ధం జరుగుతోంది..’ అంటూ వైఎస్ జగన్ నోట ఓ పొరపాటు మాట వచ్చింది. నిజానికి, ‘ప్రజల్ని నమ్మకుని.. ప్రజల కోసమే బతుకుతున్న మీ బిడ్డకీ.. విపక్షాలకీ మధ్య..’ అని వైఎస్ జగన్ అనాల్సి వుంది.
మామూలుగా అయితే, వైఎస్ జగన్ ప్రసంగాల్లో స్పష్టత కనిపిస్తుంది. అదీ సొంత ప్రసంగాలైతే. ఇలా ఎరువు తెచ్చుకున్న స్క్రిప్టులు చదవాల్సి వస్తే, ఎవరికైనా కంగారు ఖచ్చితంగా వుంటుంది.. అందులో తప్పులు ఇదిగో, ఇలా దొర్లేస్తూ వుంటాయ్. స్క్రిప్టు రాయించుకుని చదవాల్సిన అగత్యం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఎందుకు ఏర్పడుతోందన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిపోయింది.
ఇక, ‘కాపురం’ అనే మాట వ్యక్తిగత వ్యవహారం.! ఆయన ఎక్కడ వుంటారన్నది ఆయన ఇష్టం. కర్నూలులో న్యాయ రాజధాని కోసం కాపురం అక్కడికి మార్చరు కదా.?