YS Jagan: వైయస్ జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికలలో ఓటమిపాలు కావడంతో వచ్చే ఎన్నికలకు ఇప్పటినుంచి అన్ని జాగ్రత్తలను తీసుకుంటూ ముందుకు అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు. అందులో భాగంగా సీనియర్ కాంగ్రెస్ నాయకులను తన వైపుకు తిప్పుకునే పనిలో బిజీగా ఉన్నారు.
తాజాగా సీనియర్ కాంగ్రెస్ మాజీ మంత్రి సాకే శైలజనాథ్ వైసీపీ పార్టీలోకి రాబోతున్నారా అంటే అవునని తెలుస్తుంది. అనంతపురం జిల్లా సెంటిమెంట్ సెగ్మెంట్ గా ఉన్నటువంటి సింగనమల నియోజకవర్గం వర్గానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఇక్కడ ఎవరైతే విజయం సాధిస్తారో అధికారంలో కూడా అదే ప్రభుత్వం ఉంది. గత 30 సంవత్సరాల నుంచి ఇదే సెంటిమెంట్ ఇక్కడ కొనసాగుతోంది.
ఇకపోతే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బండారు శ్రావణి ప్రస్తుతం సింగనమల ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే గత ఎన్నికలలో భాగంగా వైకాపా పార్టీ నుంచి వీరాంజనేయులు అనే టిప్పర్ డ్రైవర్ కు జగన్ టికెట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. టికెట్ ఈయనకి అయినప్పటికీ పెత్తనం మాత్రం మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి భర్త ఆలూరు సాంబశివరెడ్డి అన్ని విషయాలు చూసుకునే వారిని తెలుస్తోంది.
2019 ఎన్నికలలో జొన్నలగడ్డ పద్మావతి సింగనమల నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలుపొందారు. కానీ 2024 లో మాత్రం ఈమె టికెట్ అందుకోలేకపోయారు. ఇక ఈ ఎన్నికలలో కూడా వైసిపి ఓడిపోవడంతో వచ్చే ఎన్నికలలో ఇక్కడ ఓటమి ఉండకూడదని భావించిన జగన్ కొన్ని వ్యూహాలు రచించారని తెలుస్తుంది. ఇందులో భాగంగానే సాకే శైలజనాథ్ ను తన పార్టీలోకి చేర్చుకోవడానికి సిద్ధమయ్యారని తెలుస్తుంది.
ఇక వచ్చే ఎన్నికల నాటికి నియోజకవర్గాలు కూడా పెరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో శైలజనాథును వైయస్సార్సీపీ పార్టీలోకి ఆహ్వానించు ఆయన కుమారుడు రిత్విక్ కి ఎమ్మెల్యే టికెట్ ఇయ్యాలని ఆలోచనలో కూడా ఉన్నారని ఇప్పటికే ఈ విషయం గురించి చర్చలు కూడా జరిగాయని తెలుస్తుంది. ఏ క్షణమైనా శైలజనాథ్ వైకాపా చెంతకు చేరబోతున్నట్లు ప్రకటించే అవకాశాలు ఉన్నాయని చెప్పాలి. ఇలా కాంగ్రెస్ సీనియర్ నేతలను జగన్ తనవైపుకు తిప్పుకొని తన పార్టీని బలపరుచుకొనే ఆలోచనలో ఉన్నారు.