పవన్ కోసం నితిన్ ఉబలాటపడుతున్నాడుగానీ.!

పవన్ కళ్యాణ్ అంటే దేవుడి లెక్క.. హీరో నితిన్‌కి.! పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించాలన్నది నితిన్ డ్రీమ్.! ఆ డ్రీమ్ నెరవేరబోతోందా.? అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, పవన్ కళ్యాణ్‌‌తో ఇటీవల హీరో నితిన్ భేటీ అయినట్లు తెలుస్తోంది. అది కూడా, పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించడం కోసమేనట.

ప్రస్తుతానికైతే పవన్ కళ్యాణ్, ‘ఓజీ’, ‘హరిహర వీరమల్లు’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’, ‘బ్రో’ సినిమాలు చేస్తున్నాడు. ఇందులో ‘హరిహర వీరమల్లు’ సినిమా ఎప్పుడొస్తుందో డౌటు. ‘బ్రో’ అయితే, రిలీజ్ డేట్ కన్ఫామ్ చేసుకుంది.

‘ఓజీ’ సినిమాలోగానీ, ‘ఉస్తాద్‌ భగత్ సింగ్’లోగానీ, గెస్ట్ అప్పీయరెన్స్ కోసం నితిన్ ట్రై చేస్తున్నాడా.? లేదంటే, ఏదన్నా రీమేక్ వెంచర్ నితిన్, పవన్ కళ్యాణ్ దగ్గరకు తీసుకెళ్ళాడా.? అన్నది తేలాల్సి వుంది. ఏమో, నితిన్ ఉబలాటం ఏమవుతుందో వేచి చూడాలి.