బండ్ల గణేష్ వెనకున్నదెవరు.?

గురూజీ పేరుతో బండ్ల గణేష్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి వరుస ట్వీట్లు వర్షంలా కురుస్తున్నాయ్ ఈ మధ్య. ‘గురూజీ భార్యా భర్తల్ని విడదీస్తాడు..’ గురూజీ.! గిఫ్టులిస్తే ఎవరినైనా ప్రొడ్యూసర్‌ని చేసేస్తాడు..’ అంటూ రకరకాల ట్వీట్ల వర్షం కురిపిస్తున్నాడు బండ్ల గణేష్.

‘గురూజీ’ అంటే ఎవరో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇండస్ట్రీలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ని అంతా గురూజీ అని పిలుస్తారు. ఆ గురూజీ అనబడే త్రవివిక్రమ్ శ్రీనివాస్, పవన్ కళ్యాణ్‌కి అత్యంత సన్నిహితుడు. పవన్ కళ్యాణ్‌కి అరి వీర భక్తుడు బండ్ల గణేష్. అలాంటి త్రివిక్రముడిపై బండ్ల గణేష్ ఇలాంటి ట్వీట్లు చేయడమేంటీ.?

ఇలాంటి సెటైర్లతో త్రివిక్రమ్‌పై బండ్ల గణేష్ ఎందుకింత పగ సాధిస్తున్నాడు.? అంటే అందుకు ఓ కారణమైతే వుంది. పవన్ కళ్యాణ్‌తో బండ్ల గణేష్ ఓ సినిమా చేయాల్సి వుంది. ఆ సినిమాకి త్రివిక్రమ్ అడ్డు పుల్ల వేస్తున్నాడన్న టాక్ వుంది. అందుకే గురూజీని టార్గెట్ చేశాడు బండ్ల గణేష్ అంటున్నారు.

అయితే, ఇది మాత్రమే రీజన్ కాదట. తెర వెనక పెద్ద తలకాయ ఏదో బండ్లతో ఇలాంటి ట్వీట్లు వేయిస్తోందంటూ ప్రచారం జరుగుతోంది. అందుకు రాజకీయ కారణాలా.? లేక మరేదైనా కారణమై వుండొచ్చా.? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.!