ప్రస్తుతం రవితేజ చేతిలో అరడజనుకు పైగా ప్రాజెక్టులున్నాయ్. ‘టైగర్ నాగేశ్వరరావు’, ‘ఈగల్’ తదితర ప్రాజెక్టుల్ని ఆన్ సెట్స్ సెట్ చేసుకుని పెట్టుకున్నాడు ప్రస్తుతం రవితేజ.
అయితే, ఈ మధ్య రవితేజ నుంచి వస్తున్న సినిమాలన్నీ అట్టర్ ఫ్లాప్సే అవుతున్నాయ్. కానీ, ఆయనతో సినిమాలు చేసే నిర్మాతలు మాత్రం అస్సలు తగ్గట్లేదు.
అంతేకాదు, అన్నీ ప్యాన్ ఇండియా సినిమాలే కావడం ఇంకో విశేషం. రవితేజతో సినిమా తీస్తే ఇబ్బందులు తప్పవ్.. అన్న టాక్ దండిగా వినిపిస్తోంది ఇండస్ట్రీలో. అయినా కానీ, అవేం పట్టించుకోకుండా నిర్మాతలు టేక్ లైట్ అనే ధోరణిలో వ్యవహరిస్తున్నారు.
అదెలా సాధ్యం.? అదే మిలియన్ డాలర్స ప్రశ్న. ఆ సీక్రెట్ ఏంటీ.? అని ఆరా తీస్తే.. రవితేజ ఒప్పుకున్న ప్రాజెక్టులన్నింట్లోనూ ఆయన కూడా నిర్మాణ పరంగా పెట్టుబడులు పెడుతున్నాడట.
సో, ఆ రకంగా రవితేజ సినిమాలకు ష్యూరిటీ దక్కుతోందంటూ అత్యంత సన్నిహిత వర్గాల ద్వారా అందుతోన్న సమాచారం.
ఒకవేళ అదే నిజమైతే, రవితేజ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయడానికి అదే ఏకైక కారణం కావచ్చునని అనుకుంటున్నారు సినీ మేథావులు. అలాగే ఆడియన్స్ కూడా. ఏది ఏమైతేనేం, రవితేజ తన కెరీర్ని ఎలాగోలా నిలబెట్టుకోవడానికి తనవంతు ప్రయత్నాలు చేస్తున్నాడన్న మాట.! మాస్ రాజా మామూలోడు కాదే.!