బుధవారం రాత్రి అంతా తొలి ఏకాదశి సంబరాల్లో ఉన్నారు.. పల్నాడులో రామలింగేశ్వరుడి దర్శనం కోసం కిక్కిరిసిన భక్త జన సందోహం.. బందోబస్తులో పోలీసులు బిజీగా ఉన్నారు.. స్వయంగా కొత్త ఎస్పీ అక్కడే పర్యవేక్షణలో ఉన్నారు. ఈ సమయంలోనే ఇది ఆంధ్రప్రదేశా.. తాలిబాన్లు రాజ్యమేలుతున్న ప్రాంతమా.. ఉగ్రవాదులు, నియంతల పాలనలో ఉన్న దేశమా.. అనే సందేహం కలిగించే దారుణం చోటు చేసుకుంది.
అవును… వినుకొండ నడిబొడ్డున అంతా చూస్తుండగా నడిరోడ్డుపై వైసీపీ కార్యకర్తని టీడీపీకి చెందిన వ్యక్తులు కొబ్బరి బొండాలు నరికే కత్తితో అత్యంత పాశవికంగా దాడి చేశారు. ఈ దాడిలో వైసీపీ కార్యకర్త ఒక చెయ్యి శరీరం నుంచి వేరయ్యి నేలపై పడి ఉండగా.. మరో చెయ్యి తెగిపోయింది. తలపై బలంగా నరకడంతో చీలిపోయింది. బాధితుడు రక్తపు మడుగులో నడిరోడ్డుపై ప్రాణాలు విడిచినట్లు చెబుతున్నారు!
వివరాళ్లోకి వెళ్తే… వైసీపీకి చెందిన షేక్ అబ్దుల్ రషీద్ (27) రాత్రి ఇంటికి వెళ్తుండగా.. వినుకొండ టౌన్ తెలుగు యువత నాయకుడు ఎస్.కే. జానీ తమ్ముడు జిలానీ.. మరో ఇద్దరితో కలిసి బస్టాండ్ సెంటర్ లో కత్తి చేతపట్టి మాటు వేశాడు! ఈ సమయంలో రషీద్ అ ప్రాంతానికి రాగా.. నడిరోడ్డుపై అంతా చూస్తుండగానే.. ఒక్కసారిగా ఆ కత్తితో పాశవికంగా నరకడం మొదలుపెట్టాడు!
ఈ ఘటనలో రషీద్ చేయి తెగిపడినా… జిలానీ ఆపలేదు.. అతడి తలపై విచక్షణారహితంగా దాడిచేశాడు. అనంతరం అక్కడికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నడిరోడ్డుపై రక్తపు మడుగులో ఉన్న రషీద్ ను స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు! ఈ ఘటనతో వినుకొండ ఒక్కసారిగా ఉలిక్కిపడింది!
తాజాగా కంచి శ్రీనివాస్ రావు ఎస్పీగా బాధ్యతలు తీసుకున్న రెండు రోజుల్లోనే పల్నాడులో హింసాకాండ తిరిగి ఈ స్థాయిలో మొదలవ్వడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. పైగా… ఈ ఘటనపై పూర్తి విచారణ చేయకుండానే… వ్యక్తిగత కక్షలే కారణం అని తేల్చి చెప్పేశారని.. దీనికి ప్రభుత్వ పెద్దల ఒత్తిడే కారణం అని అరోపణలు వినిపిస్తున్నాయి.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒక్కసారిగా వైరల్ గా మారింది. ఈ వీడియోని పోస్ట్ చేస్తూ రాష్ట్రపతి భవన్ తో పాటు, ప్రధాని మోడీ, ఏపీ గవర్నర్, హ్యూమన్ రైట్స్ కమిషన్ తో పాటు జాతీయ మీడియాను ట్యాగ్ చేసింది వైసీపీ.
ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే… జర్నలిస్టులమన్న సంస్కారం మరిచి, పత్రికా విలువలు ఉంటాయనే ఇంగితం మరిచిన వారు మాత్రం ఇద్దరూ వైసీపీ కార్యకర్తలే.. ఇద్దరూ మంచి స్నేహితులే.. తాగి ఇలా గొడవకు దిగారు అని ప్రచారం, ప్రసారం చేస్తుండటంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. పార్టీలకు అతీతంగా ఈ దాడిని ఖండించిన విజ్ఞులను నెటిజన్లు అభినందిస్తున్నారు!
ఏది ఏమైనా… ఏపీలో కూటమి అధికారంలొకి వచ్చిన తర్వాత వరుసగా అత్యాచారలు, హత్యాచారలు, దాడులు, హత్యాయత్నాలు, హత్యలూ జరుగుతుండటం మాత్రం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. మరి ఈ ఘటనపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, లోకేష్, హోం మంత్రి అనిత ఎలా రియాక్ట్ అవుతారనేది వేచి చూడాలి!!