ఎన్నికలు సమీపిస్తున్న వేళ పవన్ కల్యాణ్ ని నమ్ముకుని రాజకీయాల్లోకి వచ్చిన జనసేన నేతలకు దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. ఎవరి కోసం చేస్తున్నారో.. ఎందుకోసం చేస్తున్నారో తెలియని రాజకీయాన్ని పవన్ చేస్తున్నారని.. ఇది బానిసత్వ పోకడలకు నిదర్శనమని ఒక పక్క కాపు సామాజికవర్గానికి చెందిన కొంతమంది నేతలు నిప్పులు కక్కుతుంటే… నమ్ముకున్నవారిని చంద్రబాబుకోసం నట్టేట ముంచుతున్నారని పవన్ కి దూరం జరుగుతున్నారు మరికొందరు.
పైగా తమను చిన్నచూపు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూనే.. నమ్ముకున్నవారికి టిక్కెట్లు ఇవ్వలేకపోయామని అంటున్నే.. త్యాగాలు చేయాల్సిందే అని చెబుతున్నారు పవన్! అయితే ఆ త్యాగాలు ఎవరి ప్రయోజనలాకోసం అనే విషయాన్ని మాత్రం దాటవేస్తునారు. ఈ సమయంలో ఇప్పటికే పలువురు జనసేన నేతలకు పవన్ షాక్ ఇవ్వగా… వారిలో కొంతమంది జనాల్లోకి వచ్చి ఫీలవుతుంటే.. మరికొతమంది ఇంట్లో కూర్చుని బాదపడుతున్నారు. మరికొంతమంది సోషల్ మీడియా వేదికగ తమ ఆవేదన వెల్లగక్కుతున్నారు.
ఈ సమయంలో ఊహించని రీతిలో అన్నట్లుగా జనసేన కీలకనేత పోతిన మహేష్ కు షాకిచ్చారు పవన్ కల్యాణ్. ఇందులో భాగంగా… విజయవాడ వెస్ట్ సీటు ఆశించిన జనసేన నేత, ఆ పార్టీ విజయవాడ పశ్చిమ ఇన్ ఛార్జ్ పోతిన మహేష్ కు సీటు దక్కలేదు! పొత్తులో భాగంగా ఈ సీటు బీజేపీకి కేటాయిస్తున్నట్లు పవన్ తేల్చి చెప్పడంతో… ఇప్పుడు పోతిన మహేష్ ని చూసి జాలిపడేవారి సంఖ్య పెరిగిపోతుందని అంటున్నారు.
వాస్తవానికి విజయవాడలో జనసేనకు వెన్నెముఖగా నిలిచారు పోతిన మహేష్. ఇదే సమయంలో మీడియాలో కూడా పార్టీకి ట్రప్ కార్డ్ లా ఉపయోగపడ్డారు. ఈ క్రమంలో ఎంతో డబ్బు ఖర్చయ్యిందని చెబుతుండగా.. మరోపక్క కేసుల బారిన పడిన విషయాన్ని వెల్లడిస్తున్నారు. పార్టీకి క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా నిబద్దతతో పనిచేసినందుకు పవన్ ఇచ్చిన గిఫ్ట్ ఇదా అనే కామెంట్లు చేస్తున్నారని తెలుస్తుంది.
ఈ సమయంలో పోతిన మహేశ్ కీలక నిర్ణయం వైపు అడుగులు వేస్తున్నారని తెలుస్తుంది. ఇందులో భాగంగా విజయవాడ వెస్ట్ నుంచి ఇండిపెండెంట్ గా పోటీచేయాలని ఆయన ఫిక్స్ అయినట్లు చెబుతున్నారు. తనకు టిక్కెట్ దక్కకపోవడంపై కార్యకర్తలతో మహేష్ భేటీ అయ్యారు. ఈ మేరకు ఆయనపై జనసేన కార్యకర్తలు చేసిన ఒత్తిడి మేరకు.. కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా పవన్ ను కాదనుకుని, ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసేందుకే పోతిన మొగ్గు చూపుతున్నారని తెలిసింది.
దీంతో.. బెజవాడ రాజకీయం మరింత హీటెక్కగా… మరోపక్క ఏ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని చంద్రబాబు – పవన్ – బీజేపీలు జతకట్టాయో… ఇప్పుడు ఈ కూటమే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలడానికి కావాల్సినన్ని అవకాశాలు కల్పిస్తుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.