Byelection: డిసెంబరులో మరోసారి ఎన్నికల వేడి

Byelection: కేంద్ర ఎన్నికల సంఘం ఏపీ సహా నాలుగు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న ఆరు రాజ్యసభ స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. ఏపీ, ఒడిశా, పశ్చిమ బెంగాల్, హర్యానా రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న స్థానాలకు ఈ నెలాఖరులోనే నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. డిసెంబరు 3న ఉప ఎన్నికల (Byelection) నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ల దాఖలుకు తుది గడువు డిసెంబరు 10గా నిర్ణయించారు.

ఇక డిసెంబరు 11న నామినేషన్ల పరిశీలన జరగనుంది. ఉపసంహరణ గడువు డిసెంబరు 13గా ఖరారు చేశారు. డిసెంబరు 20న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగనుండగా, అదే రోజు ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మోపిదేవి వెంకటరమణ (Mopidevi Venkata Ramana Rao), బీద మస్తాన్ రావు (Beeda Masthan Rao), ఆర్. కృష్ణయ్య రాజీనామాలతో మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యాయి.

హాట్ టాపిక్: మోపిదేవి, బీదా.. పోతే ఎవరికి బాధ?

ఈ స్థానాలకు ఉప ఎన్నికలు (Byelection) నిర్వహించనున్నారు. ఇప్పటికే రాష్ట్ర రాజకీయ వర్గాల్లో అభ్యర్థుల ఎంపికపై ఆసక్తికర చర్చలు మొదలయ్యాయి. ఈ ఉప ఎన్నికల నేపథ్యంలో ఏపీలో రాజకీయ ఉత్కంఠ పెరిగింది. ప్రధాన పార్టీల అభ్యర్థుల జాబితా ప్రకటించే సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో బలపరీక్షకు సమయం ఆసన్నమైంది. ఒడిశా, పశ్చిమ బెంగాల్, హర్యానాలో మరో మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఉప ఎన్నికల అనంతరం ఈ స్థానాలకు కొత్త సభ్యులు ఎన్నికవుతారు. ఈ ఎన్నికలు ఆయా రాష్ట్రాల్లో రాజకీయ సమీకరణాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

కౌన్ బనేగా మహారాష్ట్ర సీఎం.? | Journalist Bharadwaj About Maharashtra New CM | Maharashtra CM | TR