వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన అమ్ముల పొదిలో వున్న అస్త్రాలన్నిటినీ అప్పుడే వాడేస్తోంది.! మరి, ఎన్నికల నాటికి ఏం చేస్తుందబ్బా.? ఇది, రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలకు సంబంధించిన వ్యవహారం.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ‘వారాహి విజయ యాత్ర’ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ముద్రగడ పద్మనాభం తదితరుల్ని వైసీపీ రంగంలోకి దిగింది. రెగ్యులర్ బ్యాచ్ అంబటి రాంబాబు, పేర్ని నాని తదితరులు వుండనే వున్నారు. మాజీ మంత్రి కన్నబాబు తదితరుల సంగతి సరే సరి.
రామ్ గోపాల్ వర్మ, పోసాని కృష్ణముళి లాంటి సినీ ప్రముఖుల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే.. వాళ్ళని రైట్ టైమ్లో వాడుకుంటేనే కాస్తో కూస్తో ప్రయోజనం. కానీ, వాళ్ళనీ వైసీపీ వాడేస్తోంది. దీన్ని ప్లానింగ్ లోపం అనుకోవచ్చేమో.
పోసాని కృష్ణ మురళి మీడియా ముందుకొచ్చారు.. ఆయన శైలిలో చెలరేగిపోయారు. దీని వల్ల వైసీపీకి అదనంగా వచ్చే లాభమేంటి.? ప్చ్.. ఏమీ లేదు, నష్టం తప్ప.! ఎందుకంటే, ముద్రగడ వ్యవహారంలో వైసీపీ వ్యూహం బెడిసికొడుతోంది. దానికి తోడు, పోసాని నోటి కంపు ఒకటి.!
ఔను, పోసాని కంటే.. సమర్థులైన, మాట సూటిగా వుండే సినీ ప్రముఖులతో మాట్లాడిస్తే వైసీపీకి ఏమన్నా ప్రయోజనం, జనసేనకు ఏమన్నా నష్టం వుండొచ్చు.
ముద్రగడ కారణంగానే జనసేనకు అదనపు అడ్వాంటేజీ వచ్చి పడింది. ఇప్పుడీ పోసాని తీరుతో, జనసేనకు మరింత మైలేజ్ పెరుగుతోంది. ఇదంతా వైసీపీ వ్యూహాత్మక తప్పిదం.