నటిగా పొటెన్షియాలిటీ వున్నా.. ఎందుకో, సరైన సక్సెస్ ఇంకా పాయల్ రాజ్‌పుత్‌ని వరించడంలేదు. తొలి సినిమా ‘ఆర్ఎక్స్ 100’ తర్వాత, మళ్ళీ అలాంటి సక్సెస్ ఇంకోటి తన ఖాతాలో వేసుకోవడానికి నానా తంటాలూ పడుతోంది పాయల్.
సినిమా అవకాశాలైతే బాగానే వస్తున్నాయ్.. స్టార్ వాల్యూ వున్న సినిమాలూ వస్తున్నాయ్. అన్నీ వున్నా.. అల్లుడి నోట్లో శని.. అన్నట్టు తయారైంది పాయల్ రాజ్‌పుత్ పరిస్థితి. మొన్నీమధ్యనే ‘మంగళవారం’ పేరుతో ఓ సినిమా వచ్చింది.
సినిమా డిజాస్టర్ అన్నారుగానీ, ఫర్లేదు.. బాగానే ఆడింది. థియేటర్లలో సంగతెలా వున్నా, ఓటీటీలో ఆకట్టుకుంటోంది. అసలు విషయానికొస్తే, తాజాగా పాయల్ రాజ్‌పుత్‌ని ఓ యంగ్ డైరెక్టర్ కలిశాడట. ఓ మెగా మూవీలో ఆఫర్ వుందని ఆమెతో చెప్పాడట. ఎగిరి గంతేయకుండా వుంటుందా.? కథ, కాకరకాయ్.. ఏమీ అడక్కుండా ఓకే చెప్పేసిందట ఆ బ్యూటీ.
ఆ తర్వాత ఆ సినిమాలో ఓ ఇంట్రెస్టింగ్ రోల్ గురించి దర్శకుడు వివరించాక, పాయల్ ఆనందం రెట్టింపయ్యిందట. రెమ్యునరేషన్ విషయంలో పాయల్ రాజ్‌పుత్ పెద్దగా పట్టించుకోదు. అది ఆమెకు చాలా పెద్ద అడ్వాంటేజ్.
సినిమాల్ని బాగానే ప్రమోట్ చేసుకుంటుంది కూడా.! ఇంతకీ, పాయల్ రాజ్‌పుత్ ఖాతాలో పడ్డ ఆ మెగా మూవీ ఏంటబ్బా.? అదైతే ప్రస్తుతానికి సస్పెన్స్. సినిమా ప్రారంభమై సెట్స్ మీద ఆల్రెడీ వున్న సినిమా అది.