ఓటీటీ అనే బుడగ చల్లారిపోతోందా.? ప్రముఖ ఓటీటీ సంస్థ, సినిమాల్ని నిర్మించే సంస్థలపై ఒత్తిడి పెంచుతోందా.? ఇలాగైతే, ఓటీటీ మార్కెట్‌ని నమ్ముకుని బడ్జెట్‌లు పెంచేసుకున్న పెద్ద సినిమాల పరిస్థితేంటి.?
ఏదన్నా చిన్న సినిమా లేదా వెబ్ సిరీస్ నిర్మితమవుతోందంటే, దానికి ముందుగానే రేట్ పిక్స్ చేసే పరిస్థితి ఒకప్పుడు ఓటీటీ సంస్థల్లో వుండేది. రాను రాను.. సీన్ మారింది. ఓటీటీలో ప్రదర్శితమయ్యాక, వ్యూ మినిట్స్ ఆధారంగా చెల్లింపులు మొదలయ్యాయ్. ఈ క్రమంలో కంటెంట్ క్రియేటర్స్ ఒకింత కంగారు పడ్డారు.
ఇప్పుడది పెద్ద సినిమాలకు కూడా పాకుతోంది. ఓ పెద్ద సినిమాకి సంబంధించి గతంలో భారీ డీల్ కుదిరింది.. కానీ, సదరు ఓటీటీ సంస్థ, ఆ తర్వాత షరతులు షురూ చేసింది. దాంతో, ఏం చేయాలో అర్థం కావడంలేదు మేకర్స్‌కి.
సదరు పెద్ద సినిమా మధ్యలోనే ఆగిపోయిందన్న ప్రచారం జరుగుతోందిప్పుడు. లేటెస్ట్‌గా రెండు మూడు ఇంట్రెస్టింగ్ కాంబినేషన్స్ అటకెక్కేశాయ్. సీనియర్ హీరోల సినిమాలకీ, యంగ్ హీరోల సినిమాలకీ.. అందరికీ ఇదే పరిస్థితి వచ్చేలా వుంది.
ఆల్రెడీ డీల్స్ కుదుర్చుకున్న సినిమాలు కొన్ని గట్టెక్కేయగా, కొన్ని మాత్రం ఇబ్బందులు పడుతున్నాయట. ఇంత త్వరగా ఓటీటీ బుడగ చల్లారిపోతుందని అనుకోలేదు.. అంటూ ఓ సీనియర్ హీరో ఈ మధ్యనే తన సన్నిహితుల వద్ద వాపోయినట్లు తెలుస్తోంది.
ఓ యంగ్ హీరో పరిస్థితి కూడా ఇదేనట.!