అక్కినేని నాగార్జున మరో మల్టీస్టారర్.!

అక్కినేని నాగార్జునకి, ఇతర హీరోలతో కలిసి నటించడం కొత్తేమీ కాదు. తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించి ఇలా పలువురు హీరోలతో కలిసి సినిమాలు చేయడంలో, అక్కినేని నాగార్జునకి వున్న రికార్డ్ వేరే ఏ హీరోకీ లేదని నిస్సందేహంగా చెప్పొచ్చు.

మొన్నీమధ్యనే వచ్చిన ‘నా సామి రంగ’ సినిమాలోనూ అల్లరి నరేష్, రాజ్ తరుణ్‌లతో కలిసి నటించాడు అక్కినేని నాగార్జున. తాజాగా, మళ్ళీ అలాంటి ఇంకో ఇంట్రెస్టింగ్ మూవీ చేయబోతున్నాడట కింగ్ నాగ్.

అయితే, ఈసారి స్టార్ హీరోలతో కలిసి నాగ్ ఓ కొత్త తరహా ప్రాజెక్ట్ చేయబోతున్నాడని తెలుస్తోంది. ఆ ప్రాజెక్టృకి సంబంధించి నిర్మాణంలోనూ అక్కినేని నాగార్జున భాగం పంచుకుంటాడట.

ఓ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ చెప్పిన కథకి నాగ్ స్పెల్ బౌండ్ అయ్యాడని, ఓ స్టార్ హీరోని ఈ ప్రాజెక్ట్ కోసం ఒప్పించేందుకు స్వయంగా నాగ్ చొరవ తీసుకున్నాడనీ అంటున్నారు.

ఆ ప్రాజెక్టు ఏంటి..? ఎప్పుడు అధికారికంగా ఆ వివరాలు బయటకు వస్తాయి.? అన్నది ప్రస్తుతానికైతే సస్పెన్స్. నాగార్జన తన కుమారులతోనూ సినిమాలు చేసిన సంగతి తెలిసిందే.

సినిమా కోసం ఏం చేయడానికైనా సిద్ధమవడమే కాదు, టాలెంట్‌ని ప్రోత్సహించడంలోనూ నాగ్ తర్వాతే ఎవరైనా.