మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘విశ్వంభర’ సినిమా పనుల్లో బిజీగా వున్న సంగతి తెలిసిందే. ‘బింబిసార’ ఫేం వశిష్ట ఈ చిత్రానికి దర్శకుడు. ‘భోళా శంకర్’ సినిమా దారుణమైన పరాజయాన్ని చవిచూసిన దరిమిలా, చిరంజీవి ఆచి తూచి వ్యవహరిస్తున్నారు తదుపరి సినిమాల విషయమై.
‘విశ్వంభర’ తర్వాత చిరంజీవి ఓ కమర్షియల్ సినిమా చేస్తారన్న ప్రచారం ఓ వైపు జరుగుతుండగా, ఇంకో వైపు మరో ప్రయోగానికి చిరంజీవి శ్రీకారం చుడుతున్నారన్న వార్త పుట్టుకొచ్చింది.
ఓ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ చెప్పిన కథని చిరంజీవి ఓకే చేశారన్నది తాజా ఖబర్. ఈ సినిమాలో చిరంజీవి, తన వయసుకు తగ్గ పాత్రలో కనిపిస్తారట. ఫన్ వుంటూనే, సొసైటీకి మంచి మెసేజ్ ఇచ్చేలా చిరంజీవి పాత్రని డిజైన్ చేశాడట ఆ టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్.
అయితే, ‘విశ్వంభర’ సినిమా జరుగుతుండగానే, ఈ కొత్త ప్రాజెక్టు పట్టాలెక్కుతుందా.? లేదంటే, కొంత కాలం పాటు ఆ యువ దర్శకుడు ఎదురు చూడక తప్పదా.? అన్నదానిపై స్పష్టత రావాల్సి వుంది.
వాస్తవానికి, చిరంజీవి బ్యాక్ టు బ్యాక్ రెండు మూడు సినిమాలు చేస్తుండి వుండాలి. ‘భోళా శంకర్’ ఎఫెక్ట్ కారణంగా, చిరంజీవి కాస్త ఆచి తూచి సినిమాల్ని ఎంపిక చేసుకుంటున్నారు.