బిగ్ బాస్ తెలుగు కొత్త సీజన్ రేసులోకి సమంత.?

వచ్చే సీజన్ కోసం నాగార్జున హోస్ట్‌గా వుండకపోవచ్చని బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో విషయమై గుసగుసలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. గుసగుసలు కావివి, తీవ్రాతి తీవ్రమైన డిమాండ్లు. నందమూరి బాలకృష్ణ బెటర్. రాణా దగ్గుబాటి అయితే పెర్‌ఫెక్ట్ ఛాయిస్.. అన్న ప్రచారం తెరపైకొచ్చింది.

లేటెస్ట్ ఖబర్ ఏంటంటే, బిగ్ బాస్ టీమ్.. సమంతతో సంప్రదింపులు జరుపుతోందని. సమంత అయితే బోల్డంత ఎంటర్టైన్మెంట్‌తోపాటు స్టార్ వాల్యూ కూడా లోటు ఏమీ వుండదని బిగ్ బాస్ నిర్వాహకులు భావిస్తున్నారట.

నాగచైతన్యకు విడాకులివ్వడం ద్వారా అక్కినేని కుటుంబానికి దూరమైనా, సమంత స్టార్‌డమ్ అయితే తగ్గలేదు. గతంలో అక్కినేని నాగార్జున అబ్జెన్సీలో ఓ వీకెండ్ ఎపిసోడ్‌ని సమంత రక్తికట్టించింది.

ఆ అనుభవం సరిపోతుందని బిగ్ బాస్ నిర్వాహకులు భావిస్తున్నారట. ప్రాథమికంగా సమంతతో సంప్రదింపులు కూడా జరిగినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి వుంది.