అరరె నిర్మాతలకి ప్రేక్షకుల మీద ప్రేమ పుట్టుకొచ్చేసిందే.!

Producers Thinking About Audience Safety

సినిమా థియేటర్ల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిపోయిందన్నది నిర్వివాదాంశం. నిజానికి, గత ఏడాది కరోనా కంటే ముందే థియేటర్ల పరిస్థితి దయనీయంగా తయారైపోయింది. థియేటర్ల నిర్వహణ చాలా కష్టంగా మారిపోయిందంటూ థియేటర్ల యాజమాన్యాలు గగ్గోలు పెట్టాయి. మల్టీప్లెక్సులు.. నిర్మాతల్ని బెదిరించే స్థాయికి పరిస్థితులు మారిపోయాయి. పెద్ద సినిమాలు, చిన్న సినిమాలు.. అన్నీ థియేటర్ల కారణంగా ఇబ్బంది పడ్డాయి.. థియేటర్లేమో సినిమాల కారణంగా ఇబ్బంది పడ్డాయి.

సినిమా అంటే.. అందులో అన్నీ వుంటాయి.. పంపిణీ విభాగం, థియేటర్ల వ్యవస్థ కూడా చాలా కీలకం. కానీ, పరిశ్రమల వివిధ వ్యవస్థల మధ్య కొందరు వ్యక్తుల అనవసర పెత్తనం కారణంగా సినిమా పరిశ్రమ నానాటికీ అత్యంత గందరగోళ పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది. నిర్మాతల కోరిక మేరకు ప్రభుత్వాలు, కొన్ని రోజుల పాటు లేదా కొన్ని వారాల పాటు టిక్కెట్ల ధరల్ని పెంచడం అనేది ఓ యెత్తు.. థియేటర్లలో జరిగే బ్లాక్ టిక్కెటింగ్ దోపిడీ ఇంకో యెత్తు.

నిర్మాతలకు తెలిసే బ్లాక్ టిక్కెట్ల దందా జరుగుతోందన్న విమర్శలున్నాయి. కొత్త సినిమా అంటే, సాధారణ ప్రేక్షకులు సినిమా చూడ్డానికి అవకాశమే వుండదన్నట్టు తయారైంది పరిస్థితి. వెరసి, సినిమా అంటేనే ప్రేక్షకుడికి వెగటుపుట్టేసింది. ఇంతలోనే కరోనా వచ్చింది.. ఓటీటీ జోరు పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో థియేటర్లకు ప్రేక్షకుల్ని తిరిగి రప్పించడమంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదు. థియేటర్లకు నిర్మాతలు సహకరించాలి.. ప్రభుత్వాలూ సహకరించాలి.

అదే సమయంలో, ప్రేక్షకుల్ని థియేటర్లకు గౌరవంగా రప్పించాలి.. అంటే, బ్లాక్ టిక్కెటింగ్ అనేది వుండకూడదు. ఓ ప్రముఖ నిర్మాత.. తన సినిమా విడుదల సందర్భంగా ప్రేక్షకుల భద్రత గురించి పెద్ద మాటలు మాట్లాడేశాడు. ఏమయిపోయింది ఈ బాధ్యత, తన అధీనంలో వున్న థియేటర్లలో బ్లాక్ టికెటింగ్ జరుగుతున్నప్పుడు.? అన్న ప్రశ్న ప్రేక్షకుల నుంచే వస్తోంది మరి.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles