Prabhas: టాలీవుడ్ పాన్ ఇండియా హీరో డార్లింగ్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీబిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో అరడజన్ కు పైగా పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి. బాలీవుడ్ టాలీవుడ్ ఇండస్ట్రీలలో అత్యధిక పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న హీరోల జాబితాలో ప్రభాస్ నెంబర్ వన్ స్థానంలో ఉన్నారు. ప్రభాస్ నటిస్తున్న సినిమాలు అన్నీ కూడా కోట్ల బడ్జెట్ తో నిర్మితమవుతున్నవే. సినిమాలు అనుకున్న సమయానికి వచ్చిన రాకపోయినా బిజీగా ఉండే హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక ప్రభాస్ అని చెప్పాలి.
చేతినిండా బోలెడు సినిమా అవకాశాలు ఉండడంతో సెట్స్ పై రెండు సినిమాలు లైన్ లో మూడు సినిమాలు వీటికి తోడు కొత్త కొత్త సినిమాలు సైన్ చేస్తూ చాలా బిజీగా ఉన్నారు ప్రభాస్. ఇలా ఎక్కువ సినిమాలు చేతిలో ఉండడంతో కాస్త కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతోంది. మూవీస్ లైనప్ విషయంలోనే కాస్త కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. ముఖ్యంగా ఏది ముందు ఏది తర్వాత అనే లెక్కల్లో మేకర్స్ మధ్య క్లారిటీ మిస్ అవుతుంది. కరోనా తర్వాత ఒకే సమయంలో రాధే శ్యామ్, సలార్, కల్కి, ఆదిపురుష్ సినిమాలకు సైన్ చేసారు ప్రభాస్. అవి సెట్స్‌పై ఉన్నపుడు డేట్స్ విషయంలో చాలా ఇబ్బందులు ఫేస్ చేసారు ప్రభాస్. రిలీజ్ డేట్స్ దగ్గర కూడా క్లాష్ వచ్చింది.
దాంతో కలికి సినిమా విడుదల అయిన తరువాత ఒకసారి ఒక సినిమా మాత్రమే అని డిసైడ్ అయిపోయారు ప్రభాస్. అందుకే ప్రస్తుతం తన ఫోకస్ మొత్తం రాజా సాబ్ సినిమా పైనే పెట్టారు. గత కొన్నాళ్ళుగా హను రాఘవపూడి ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్నారు. ఒకే సినిమా చేయాలనుకున్నా ఫౌజీతో పాటే రాజా సాబ్‌కు కూడా ప్రభాస్ డేట్స్ చేయక తప్పట్లేదు. ఈ కన్ఫ్యూజన్ ఇక్కడితో చాలు. ఇకపై ఒక్కసారి ఒక్క సినిమానే అంటున్నారు డార్లింగ్. కానీ ఈ విషయంలో దర్శక నిర్మాతలు కన్ఫ్యూజ్ అవుతున్నారు. అందుకే మొన్న కల్కి 2 సెప్టెంబర్ నుంచి మొదలవుతుందని అశ్వినీదత్ చెప్తే తాజాగా స్పిరిట్ కూడా అప్పుడే అంటున్నారు నిర్మాతలు. కల్కి 2 షూటింగ్ సెప్టెంబర్‌లో మొదలుపెట్టి 2026 సమ్మర్‌కి విడుదల చేస్తామని చెప్పారు అశ్వినీదత్. తాజాగా సందీప్ వంగా సోదరుడు ప్రణయ్ వంగా తమ స్పిరిట్ కూడా సెప్టెంబర్‌లో స్టార్ట్ అవుతుందని అంటున్నారు. మరి ఈ 2 సినిమాల్లో ప్రభాస్ దేన్ని ముందు సెట్స్ పైకి తీసుకొస్తారు? అసలు సెప్టెంబర్ లోపు సెట్స్‌పై ఉన్న ఫౌజీ, రాజా సాబ్ పూర్తవుతాయా అనేది ఆసక్తికరంగా మారింది. ఈ విషయంలో అటు నిర్మాతలు, ఇటు మూవీ మేకర్స్ అభిమానులు కూడా కాస్త కన్ఫ్యూజన్ లో ఉన్నారు.
