Tollywood: ఒక సినిమా హిట్ అవ్వాలి అంటే ఆ సినిమాలో కథ నటీనటులతో పాటుగా మ్యూజిక్ కూడా ముఖ్యపాత్ర వహిస్తుంది అన్న విషయం అందరికీ తెలిసిందే. మ్యూజిక్ ప్రేక్షకులకు నచ్చినట్టు ఉంటే అది సినిమాకి హైలైట్ గా నిలుస్తుంది అని చెప్పాలి. కథను ముందుకు తీసుకెళ్లడంతో పాటు ప్రేక్షకుల భాగోద్వేగాలను కట్టిపడేటయ్యాలి అంటే అది ఒక మ్యూజిక్ మాత్రమే సాధ్యం అని చెప్పాలి. కానీ ఇంతకుముందు ఉండే మ్యూజిక్ డైరెక్టర్ తో పోల్చుకుంటే ఇప్పుడున్న మ్యూజిక్ డైరెక్టర్లు నిర్మాతలను ఇబ్బందికి గురి చేస్తున్నారట. ఒకప్పుడు మ్యూజిక్ డైరెక్టర్లు ఎంతో నిబద్దతతో పని చేసే వారిని సినిమా విడుదల తేదీ అనౌన్స్ చేసే లోపే మ్యూజిక్ పని మొత్తం ఫినిష్ చేసేవారు.
కానీ ప్రస్తుత పరిస్థితులు అందుకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయట. ఇప్పుడు కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ వల్ల రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన సినిమాలు కూడా వాయిదా పడుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ సరైన సమయానికి పని పూర్తి చేయకపోవడం వల్లనే తెలుగులో రెండు సినిమాలు వాయిదా పడుతున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. అవే ఒకటి కుబేర, రెండు కింగ్ డమ్. ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కుబేర. నాగార్జున సపోర్టివ్ రోల్ లో నటిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నాయి. జూన్ 20న కుబేర ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా కానీ, ఇప్పటివరకు ప్రమోషన్స్ మొదలు పెట్టలేదు.
ఈ మధ్యనే నాగ్ తన పాత్రకు డబ్బింగ్ ను ఫినిష్ చేశాడు. ఇంకా చాలా పనులు పెండింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది. సినిమా విడుదలకు కేవలం పదంటే పదే రోజులు మిగిలి ఉంది. కానీ ఇంకా రెండు పాటలు పెండింగ్ ల ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఆ రెండు పాటల ఫైనల్ రికార్డింగ్ ఇంకా అవ్వలేదని తెలుస్తోంది. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ ని అందిస్తున్న విషయం తెలిసిందే. దేవిశ్రీప్రసాద్ మాత్రమే కాకుండా చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్లు ఈ మధ్యకాలంలో ఇలా ఆలస్యం చేస్తుండడం పట్ల నిర్మాతలు మండిపడుతున్నారట. ఒకవేళ పరిస్థితులు ఇలాగే కొనసాగితే మాత్రం కష్టమే అని అంటున్నారట నిర్మాతలు. కాబట్టి మ్యూజిక్ డైరెక్టర్లు నిర్మాతలకు ఇబ్బంది కలిగించకుండా మ్యూజిక్ పనిని ఎంత వీలైతే అంత తొందరగా పూర్తి చేస్తే బాగుంటుందని నిర్మాతలు భావిస్తున్నట్టు తెలుస్తోంది.