Tollywood: తాజాగా పలువురు టాలీవుడ్ నిర్మాతలు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఇందుకు గల కారణం ఈ మధ్యకాలంలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో జరిగిన సమ్మె. ఈ సమ్మె కారణంగా సినిమా పరిశ్రమలో అనేక సమస్యలు వచ్చిన విషయం తెలిసిందే. సినిమా షూటింగ్ లు ఆగిపోవడంతో పాటు, సినిమాల విడుదలలు కూడా వాయిదా పడిన విషయం తెలిసిందే.
అయితే ఇలాంటి పరిస్థితుల్లో సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకొని, సమ్మె విరమించేందుకు చర్యలు తీసుకోవడం ఇప్పుడు పరిశ్రమకు కాస్త ఊరట లభించినట్లు అయింది. ఈ పరిణామాల నేపథ్యంలో టాలీవుడ్ నిర్మాతల సంఘం ప్రతినిధులు సీఎంని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అయితే ఈ బేటీలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. సినీ పరిశ్రమకు పూర్తిగా సహకారం అందిస్తాము. కానీ పరిశ్రమను నియంత్రిస్తామంటే ప్రభుత్వం సహించదు అని స్పష్టం చేశారు.
ఎవరైనా చట్ట పరిధిలో పనిచేయాల్సిందే అని నిర్మాతలు, దర్శకులకు స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి. అలాగే సినీ పరిశ్రమలో పని వాతావరణం బాగుండాలని, కార్మికుల పట్ల నిర్మాతలు మానవత్వంతో వ్యవహరించాలని సీఎం రేవంత్ తెలిపారు. పరిశ్రమలోకి కొత్తగా వచ్చే వారికి నైపుణ్యాలు పెంచేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. అందుకోసం ఒక కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. స్కిల్ యూనివర్సిటీలో సినిమా పరిశ్రమ కోసం కావాల్సిన ఏర్పాట్లు చేస్తామని అన్నారు. పరిశ్రమలో నిర్మాతలు, కార్మికుల అంశంలో సంస్కరణలు అవసరమని చెప్పారు. నిర్మాతలు, కార్మికులు, ప్రభుత్వం కలిసి పాలసీ తీసుకువస్తే బాగుంటుందని చెప్పారు. అయితే ఈ సందర్బంగా ఆయన చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Tollywood: తెలంగాణ సీఎంతో భేటీ అయిన సినీ పెద్దలు.. ఆ విషయంలో ప్రభుత్వం సహించదంటూ!
