హీరోయిన్ పూనం కౌర్ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. ముఖ్యంగా ఏపీ రాజకీయాల్లో జరుగుతున్న కొన్ని విషయాలపై ఆమె సంచలనాత్మకంగా స్టేట్ మెంట్స్ ఇస్తుంటారు అవి ఎవరిని ఉద్దేశించి అనేది తెలిసిన విషయమే అయినప్పటికీ… అవి ఎప్పుడూ ఆయనతో విభేదించేవిగానే ఉండేవి! అయితే మొట్టమొదటిసారిగా ఆయనతో ఏకీభవిస్తూ స్పందించింది పూనం!
ఇప్పటివరకూ పూనం పెట్టిన ట్వీట్లు, వాటి వెనక ఉన్న కారణాలు, వాటికి వచ్చిన రియాక్షన్ల గురించి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా చంద్రబాబు విషయంలో పూనం కౌర్ తాజాగా ట్వీట్ చేశారు. ఇప్పటికే చంద్రబాబు అరెస్టును సీరియస్ గా ఖండిస్తూ, రచ్చ రచ్చ చేస్తున్న వారి అభిప్రాయాలతో పూనం ఏకీభవించారు. దీంతో ఈ ట్వీట్ వైరల్ గా మారింది.
ఎప్పుడూ ఒకరిని మనసులో పెట్టుకుని, వారిని నిందిస్తూ, తిడుతూ, ఎద్దేవా చేస్తూ ట్వీట్లు పెడతారని.. అది ఆమెకు జరిగిన ద్రోహానికి ఇచ్చే రియాక్షన్ అంటుంటారు. అయితే ఈ సారి చంద్రబాబు అరెస్టును ఆమె కూడా ఖండిస్తున్నట్లుగానే ట్వీట్ చేశారు పూనం. దీంతో… ఫస్ట్ టైం ఏకీభవించినట్లుంది అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఇందులో భాగంగా… “73 ఏళ్లు అంటే జైల్లో ఉండాల్సిన వయసు కాదు. ప్రజా జీవితంలో ఎన్నో ఏళ్ల పాటు సేవలు అందించిన తర్వాత ఇలా జైల్లో ఉండడం బాధాకరం. ఇప్పుడు జరుగుతున్న విషయాలపై మాట్లాడడానికి నాకెలాంటి అధికారం కానీ, సంబంధం కానీ లేదు. అయితే మానవత్వంతో మాత్రమే స్పందిస్తున్నాను. చంద్రబాబునాయుడు సార్ ఆరోగ్యం, వయసును పరిగణనలోకి తీసుకోవాలని మానవతా దృక్పథంతో విజ్ఞప్తి చేస్తున్నాను” అంటూ పూనం ట్వీట్ చేశారు.
దీంతో రాఘవేంద్రరావు, అశ్వినీదత్, నారా రోహిత్, నట్టి కుమార్ తదితర సినీ జనాల అనంతరం బాబు పై స్పందించిన ఆ లిస్ట్ లో తాజాగా పూనం కౌర్ వచ్చి చేరారు. దీంతో… ఆమె కూడా అతడితో ఈ సారి ఏకీభవించింది అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఆ సంగతి అలా ఉంటే… ఈ ట్వీట్ పై వస్తున్న మరికొన్ని కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి. ఇందులో భాగంగా… “సీనియర్ ఎన్టీఆర్ ఫోటో పెట్టి.. 73 ఏళ్ల వయసులో ఉన్న వారిని బహిరంగంగా చెప్పుతో కొట్టడం మంచిదేనా?” అని కామెంట్ చేశారు ఒక నెటిజన్.
ఇదే సమయంలో… “అతను 371 కోట్ల భారీ కుంభకోణంలో పాల్గొన్నాడు.. ఆ వయస్సులో సాక్షులను ప్రభావితం చేయగలడు, తారుమారు చేయగలడు.. కాబట్టి ప్రస్తుతం జైలులో ఉంచబడ్డాడు. ఒకప్పుడు బాబు అండ్ కో తనకి వయసు కేవలం ఒక సంఖ్య అని చెప్పడం నాకు గుర్తుంది” అంటూ మరో నెటిజన్ కీలక కామెంట్ చేశాడు.
73 is not a age to be in space of jail after u have served for considerable about time in public life ,have no authority or connection to any of the things which are happening but as a humanitarian plea for #ChandrababuNaidu sir health to be considered by respective people 🙏.
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) September 13, 2023