గతకొన్ని రోజులుగా ఏపీ రాజకీయాల్లో ఒక గాసిప్ తెగ చక్కర్లు కొడుతుంది. అదేమిటంటే… రాబోయే ఎన్నికల్లో నారా లోకేష్ మంగళగిరి నుంచి పోటీ చేయడం లేదని.. వేరే సేఫ్ జోన్ చూసుకుంటున్నారని! పైగా తాజాగా రాజధాని ప్రాంతంలో, మంగళగిరి నియోజకవర్గంలో 51వేలకు పైంగా పేద ప్రజలకు జగన్ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. దీంతో… ఇక లోకేష్ కు కష్టమే అనే కామెంట్లు బలంగా వినిపిస్తున్నాయి. దీంతో… అయితే లోకేష్ ఈ సారి మంగళగిరిలో పోటీ చేయరనే కామెంట్లు తెరపైకి వచ్చాయి.
అయితే… ఆ గాసిప్స్ నిజమయ్యి, లోకేష్ గనుక రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో నియోజకవర్గం మారితే.. అది చారిత్రక తప్పిదమే అవుతుందని అంటున్నారు విశ్లేషకులు. కారణం… లోకేష్ ఈ నిర్ణయం తీసుకుంటే… అది కేడర్ కాన్ఫిడెన్స్ ని ఘోరంగా దెబ్బతీస్తుందని అంటున్నారు. అదే జరిగితే ఓటమిని పరోక్షంగా అంగీకరించినట్లు భావించే ప్రమాధం ఉందని హెచ్చరిస్తున్నారు. అవసరమైతే రెండూ చోట్ల పోటీ చేసుకుని సెఫ్ గేం ఆడొచ్చుకానీ… మంగళగిరి విషయంలో ముందే తగ్గడం మంచిది కాదని సూచిస్తున్నారు.
పైగా… జగన్ లాగా పులివెందుల వంటి వైసీపీ సేఫ్ జోన్ లో ఎవరైనా పోటీ చేస్తారు… పార్టీకి బలం లేని చోట్ల తనలా ధైర్యంగా పోటీ చేయాలని లోకేష్ గతంలో కామెంట్లు చేశారు. ఈ సమయంలో మంగళగిరి విషయంలో లోకేష్ వెనకడుగు వేస్తే… గత స్టేట్ మెంట్స్ ని వైరల్ చేసే ప్రమాధం ఉంది. ఇది లోకేష్ పైనే కాకుండా… యావత్ రాష్ట్రంలోని కేడర్ పైనా, ఓటర్లపైనా ప్రభావం చూపించే ఛాన్స్ పుష్కలంగా ఉందని అంటున్నారు పరిశీలకులు. మరి రాబోయే రోజుల్లో మంగళగిరి విషయంలో లోకేష్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది వేచి చూడాలి!