సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీగా చెప్పుకునే కొణిదెల, అల్లు కుటుంబాలకు సంబంధించిన విషయాలు ఎప్పుడూ హాట్ టాపిక్ అనే సంగతి తెలిసిందే. పైగా అవి రాజకీయాలకు సంబంధించిన అంశాలైతే అవి మరింత చర్చన్నీయాంశం అవుతుంటాయి. ఈ క్రమంలో తాజాగా ఏపీలో సార్వత్రిక ఎన్నికల వెళ ఒక అసక్తికరమైన విషయం తెరపైకి వచ్చింది. దీనికి తోడు నాగబాబు తనదైన ఆవేశంతో అన్నట్లుగా చేసిన ఒక ట్వీట్ ఇప్పుడు ఈ రచ్చను పీక్స్ కి తీసుకెళ్లిందని అంటున్నారు.
అవును… ఏపీలోని సార్వత్రిక ఎన్నికలు మెగా ఫ్యామిలీలో చిచ్చుపెట్టాయనే చర్చ తెరపైకి వచ్చింది. గతంలో కూడా అడపా దడపా కొన్ని గొడవలు ఉన్నట్లు కనిపించినా.. ఈసారి అవి స్పష్టమైన విభజన రేఖను గీసేశాయని అంటున్నారు. అల్లు ఫ్యామిలీకి, మెగా ఫ్యామిలీకి మధ్య పొలిటికల్ గోడలు కట్టేశాయని చెబుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా నాగబాబు చేసిన ట్వీట్.. బన్నీ ఫ్యాన్స్ ని మరింత రెచ్చకొట్టేలా ఉందని అంటున్నారు.
“మాతో ఉంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మావాడైన పరాయివాడే.. మాతో నిలబడేవాడు పరాయివాడైన మావాడే…!” అంటూ ఎవరి పేరూ ఎత్తకుండా చెప్పలనుకున్న విషయం చెప్పేశారు నాగబాబు! దీంతో… ఇది వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తరుపున ప్రచారం చేసిన బన్నీ గురించే అని.. ఇప్పుడు అతడు తమకు పరాయివాడయ్యాడని చెప్పడమే నాగబాబు ఉద్దేశ్యం అనే భావానువాదం తెరపైకి వచ్చింది.
వాస్తవానికి ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి ఎమ్మెల్యే అవ్వాలని బలంగా ఫిక్సయిన పవన్ కల్యాణ్.. అందుకు భీమవరం, గాజువాక అకంటే పిఠాపురం సెఫ్ అని భావించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో… పిఠాపుర్మ్ అసెంబ్లీ స్థానానికి పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న సందర్భంలో ఆయనకు మెగా ఫ్యామిలీ మొత్తం అండగా నిలిచింది.
ఇందులో భాగంగా… నాగబాబు కుటుంబంతో పాటు మెగా మేనల్లుళ్లు నేరుగా రంగంలోకి దిగి ప్రచారం చేశారు. మెగాస్టార్ చిరంజీవి.. తన తమ్ముడిని గెలిపించాలని రిక్వస్ట్ చేస్తూ ఒక వీడియో సందేశం ఇచ్చారు. చివర్లో రామ్ చరణ్.. బాబాయ్ కోసం పిఠాపురం వచ్చారు. అయితే.. పవన్ కి మద్దతుగా ట్వీట్ చేసిన అల్లు అర్జున్ మాత్రం తన స్నేహితుడైన వైసీపీ అభ్యర్థి కోసం నంద్యాల రావడం సంచలనంగా మారింది.
రావడమే కాదు.. తన స్నేహితుడ్ని గెలిపించాలని బన్నీ ఓటర్లకు పిలుపునిచ్చారు. దీంతో.. బన్నీ సపోర్ట్ వైసీపీకి అనే ప్రచారం జరిగింది.. ఇది జనసైనికులకు ఆగ్రహం తెప్పించింది. చివరి నిమిషంలో ఇదేమి ట్విస్ట్ అంటూ వారంతా ఫైరయ్యారు. అయితే… పోలింగ్ కు ముందు తమ అభిప్రాయాన్ని, ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం ఏ మాత్రం సేఫ్ కాదని జనసేన భావించినట్లు చెబుతున్నారు.
ఈ సమయంలో… పోలింగ్ పూర్తయిన తర్వాత నాగబాబు ఓ ట్వీట్ వేశారు. పోలింగ్ దాదాపుగా ముగిసింది, ఇప్పుడు ట్వీట్ పెట్టినా రిస్క్ లేదనుకున్నారో ఏమో కానీ.. పోలింగ్ ప్రక్రియ దాదాపుగా ముగిసిన తర్వాత నర్మగర్భంగా ట్వీట్ చేశారు. ఇంకేముంది.. సోషల్ మీడియాలో మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్ వార్ మొదలైంది. మరి ఈ రచ్చ చినికి చినికి ఎంత పెద్ద గాలివానగా మారబొతోందనేది వేచి చూడాలి.