తెలుగులో ప్రసారమయిన బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు షో ముగిసిన విషయం తెలిసిందే. ఆదివారం రోజున గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ జరగగా నిఖిల్ ఈసారి సీజన్ విన్నర్ గా నిలిచారు. మొదటినుంచి ఈ స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఉంటూ వస్తున్న నిఖిల్ ఎట్టకేలకు టైటిల్ ని గెలిచాడు. నిఖిల్ బిగ్ బాస్ విన్నర్ అవుతాడని ఎంతమంది ఆసక్తిగా ఎదురుచూశారో.. బిగ్ బాస్ తరువాత కావ్యతో కలవాలని.. తన ప్రేమ కావ్యాన్ని మళ్లీ మొదలుపెట్టాలని అంతే ఆశగా ఎదురుచూశారు.
ఎందుకంటే.. కావ్య ప్రేమను తిరిగి పొందటం కోసం తాను ఎంత తపిస్తున్నాడో కన్నీళ్లు పెట్టుకుని మరీ చెప్పాడు నిఖిల్. బిగ్ బాస్ స్టేజ్ మీదికి వెళ్లిన ఫస్ట్ డే.. నాగార్జునతో తాను సింగిల్ అని చెప్పాడు నిఖిల్. కొన్నాళ్లకి తనకి కావాల్సిన వాళ్లు బయట ఉన్నారని అన్నాడు. మరికొన్నాళ్లైన తరువాత.. కావ్య కోసం ఎదురుచూస్తున్నా.. తన ప్రేమను తిరిగి నిలబెట్టుకోవడం తపిస్తున్నా.. అని తెగ ఏడ్చేశాడు.
టైటిల్ గెలివగానే నేరుగా తన ప్రేయసి కావ్య దగ్గరకే వెళ్తానని హౌస్‌లో ఉన్నప్పుడు అన్నాడు. అయితే ఈ విషయంపై స్పందించిన కావ్య ఇండైరెక్ట్ పోస్టులతో చెప్పకనే చెప్పింది. ఆ ముసుగు చూసి మోసపోకండి.. అతను పెద్ద నటుడు అంటూ పోస్టులు పెట్టింది. ఇప్పుడు అది నిజమే అంటూ నిరూపిస్తున్నాడు నిఖిల్. బయటికి వచ్చిన తర్వాత కావ్య దగ్గరికి వెళ్ళలేదు సరి కదా బిగ్‌బాస్ టైటిల్ గెలిచిన తర్వాత డైరెక్ట్‌గా మైసూర్ వెళ్లిపోయి అక్కడ విజయోత్సవం చేసుకున్నాడు.
ఆ తర్వాత ఇంటికి వచ్చిన తన ఫ్రెండ్స్, రిలేటివ్స్, ఆర్టిస్టులతో కలిసి పార్టీలు చేసుకున్నాడు. తాజాగా నైనికతో కలిసి చేసిన ఓ డ్యాన్స్ వీడియోని తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు.ఇది చూసిన ఫ్యాన్స్.. నెటిజన్లు నిఖిల్‌ని ఏకిపారేస్తున్నారు. హౌస్ లో ఉన్నప్పుడు కావ్యని చెడ్డ దానిని చేసి ఇప్పుడు ఆమె దగ్గరికి వెళ్లకుండా ఎంజాయ్ చేస్తున్నావా అంటూ దుమ్మెత్తి పోస్తున్నారు మరి దీనికి నిఖిల్ ఎలా రి యాక్ట్ అవుతాడో చూడాలి.