Allu Aravind: ప్రముఖ సినీ నటుడు అల్లు అరవింద్ తాజాగా హైదరాబాద్ కిమ్స్ ఆస్పత్రికి వెళ్లారు. సంధ్య థియేటర్ దగ్గర భాగంగా గాయపడిన చిన్నారి శ్రీ తేజ్ ను ఈయన పరామర్శించడానికి వెళ్లారు. పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా అల్లు అర్జున్ అలాగే ఇతర సెలబ్రిటీలు సంధ్య థియేటర్ కు వెళ్లారు. అయితే అల్లు అర్జున్ రావడంతో ఒక్కసారిగా అక్కడ అభిమానులు ఆయనని చూడడం కోసం ఎగబడ్డారు దీంతో తొక్కిసలాట జరిగింది ఈ దక్కిసలాటలో భాగంగా రేవతి అనే మహిళ మరణించిన సంగతి తెలిసిందే.
ఇలా రేవతి మరణించడమే కాకుండా ఆమె కుమారుడు శ్రీ తేజ్ తీవ్ర గాయాలు పాలయ్యారు.. దీంతో ఆ చిన్నారిని హైదరాబాద్ కిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు అయితే ఆ చిన్నారి ఆరోగ్య పరిస్థితి కూడా విషమంగానే ఉందని తెలుస్తుంది. ఆయన బ్రెయిన్ ఇన్ఫెక్షన్ అయ్యిందని ఆహారం కూడా పైప్స్ సహాయంతో అందిస్తున్నారని తెలుస్తుంది. ఇకపోతే తాజాగా అల్లు అరవింద్ ఈ చిన్నారిని చూడడం కోసం కిమ్స్ ఆస్పత్రికి వెళ్లారు.
ఈ తొక్కిసలాట ఘటనలో భాగంగా రేవతి మరణించడంతో ఇప్పటికే ఈ కుటుంబానికి అండగా ఉంటామని అల్లు అర్జున్ అలాగే అరవింద్ తెలియజేశారు. ఇక ఈ చిన్నారి కోసం అవసరమైనటువంటి ఇంజక్షన్ సింగపూర్ నుంచి అల్లు అర్జున్ తెప్పించిన విషయం మనకు తెలిసిందే. అయితే అల్లు అర్జున్ మాత్రం ఇప్పటివరకు తనని పరామర్శించడానికి వెళ్లలేదు.
ప్రస్తుతం కోర్టు కేసులో ఉన్న నేపథ్యంలో లాయర్లు సలహాలు సూచనలు మేరకు తాను ఎక్కడికి వెళ్ళకూడదని చెప్పారు అందుకే తాను శ్రీ తేజ్ ను పరామర్శించడానికి వెళ్లలేదని అయినప్పటికీ తన సహకారం ఆ కుటుంబానికి ఉంటుందని భరోసా ఇచ్చారు ఇలా అల్లు అర్జున్ వెళ్లలేని పరిస్థితులలో ఆయన తండ్రి అల్లు అరవింద్ కిమ్స్ ఆసుపత్రికి వెళ్లి చిన్నారిని పరామర్శించారు అనంతరం రేవతి భర్తతో అల్లు అరవింద్ మాట్లాడారని తెలుస్తోంది.
