మహేష్ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా.?

సూపర్ స్టార్ మహేష్‌బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా కొన్నాళ్ళ క్రితం ప్రారంభమైన విషయం విదితమే. మహేష్ ఇటీవల వరుస విషాదాల్ని కుటుంబంలో ఎదుర్కొనడంతో, సినిమా తదుపరి షెడ్యూల్ ప్రారంభమవడానికి కొంత సమయం పడుతోంది.

ఈసారి షెడ్యూల్ చాలా లాంగ్ అని ఇప్పటికే ఓ క్లారిటీ వచ్చేసింది. ఏకధాటిగా ఈ సినిమా కొత్త షెడ్యూల్ షూటింగ్ జరుగుతుందట. దానికోసం మహేష్ సిద్ధమవుతున్నాడు.

కాగా, సినిమాలో హీరోయిన్ ఎవరన్నదానిపై కన్‌ఫ్యూజన్ కొనసాగుతోంది. పూజా హెగ్దే పేరు ఇప్పటికే ఖరారైనా, మార్పు వుండొచ్చన్న గుసగుసలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

తాజాగా, తమన్నా పేరు ప్రచారంలోకి వచ్చింది. అయితే, ఆమె సినిమాలో హీరోయిన్ కాదు.. ఓ స్పెషల్ రోల్ అని అంటున్నారు. రష్మికతో స్పెషల్ సాంగ్ చేయిస్తున్నారని గతంలో వార్తలు రాగా, ఆ ప్లేస్‌లోకే తమన్నా వచ్చిందన్నది తాజా ఖబర్. ఇందులో నిజమెంతో తేలాల్సి వుంది.