మహేష్ తొందరపెట్టేస్తున్నాడా.?

‘గుంటూరు కారం’ రకరకాల కారణాలతో స్లోగా నడుస్తూ వచ్చింది. కానీ, ఇప్పుడు తొందరపాటు మొదలైందట. అవును ఈ సినిమా విషయంలో మహేష్ బాబు ఎదుర్కొన్నన్ని విమర్శలూ, దుష్ర్పచారాలు.. గతంలో ఏ సినిమా విషయంలోనూ ఎదుర్కొని వుండరు మరి.

మొన్నీ మధ్య ప్రత్యేకంగా ప్రెస్ మీట్‌లో పాల్గొని మహేష్ ఈ సినిమాపై వస్తున్న గాసిప్స్‌కీ, నెగిటివిటీకి చెక్ పెట్టే ప్రయత్నం చేశారు.

అందులో భాగంగానే ఫ్యాన్స్‌కి మాటిచ్చేశారు ఖచ్చితంగా ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ అవుతుందని. సో, స్పీడ్ అప్ చేయాల్సిన అవసరం వుంది. ఆ క్రమంలోనే డైరెక్టర్ త్రివిక్రమ్‌పై మహేష్ ఒత్తిడి తీసుకొస్తున్నారట. వారం రోజుల్లో పూర్తవ్వాల్సిన పార్ట్ నాలుగైదు రోజుల్లోనే కంప్లీట్ చేస్తున్నారట.

ఈ న్యూస్ లీక్ అవ్వగానే.. ఇలా అయితే, క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుందంటూ కొత్త లీకులు మొదలయ్యాయట.

అయితే, అదేం లేదు. ఎక్స్‌ట్రా ఎఫర్ట్స్ పెడుతున్నారంటూ చిత్ర వర్గాలు కన్‌ఫామ్ చేస్తున్నాయ్. ప్రస్తుతం వున్న పరిస్థితుల్లో క్వాలిటీ వియంలో అస్సలు కాంప్రమైజ్ కాకూడదు. ఏ మాత్రం కాంప్రమైజ్ అయినా ఇక అంతే, వ్యవహారం చాలా తేడా కొట్టేస్తుందంతే. చెప్పాలంటే ఇది మహేష్‌కి ఒకింత అగ్ని పరీక్షే.!