మనలో చాలామంది లక్ ను నమ్ముతారు. కొన్ని రత్నాలు ధరించడం వల్ల సులువుగానే లక్ కలిసొస్తుందని ఫీలవుతారు. తొమ్మిది రకాల రాళ్లను నవరత్నాలు అని అంటారు. వజ్రం, వైఢూర్యం, ముత్యం, పగడం, పచ్చ, నీలం, కెంపు, పుష్యరాగం, గోమేధికం, మరకతం ధరించడం వల్ల శుభ ఫలితాలను సులువుగానే పొందవచ్చు. జాతకాలు, గ్రహాల అనుగ్రహాన్ని బట్టి ఉంగరం, లాకెట్ లలో వీటిని ఏర్పరుస్తారు.
నవరత్నాలు ధరించే సమయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. పుట్టిన తేదీ, పేరు ప్రకారం నవరత్నాలను ఎంపిక చేయడం జరుగుతుంది. ఈ రత్నాలలో త్రిభుజాకారంలో ఉన్నవి అగ్ని మూలకాలను ప్రభావితం చేస్తే, కోడిగుడ్డు ఆకారంలో ఉన్నవి నీటిమూలకాలను ప్రభావితం చేసే అవకాశాలు అయితే ఉంటాయి. రత్నం బరువు, మనిషి బరువు, రత్నాన్ని పొదిగే బంగారం బరువు పరిగణనలోకి తీసుకుని లాకెట్ ను తయారు చేయించుకోవాలి.
ఉంగరం అయినా లాకెట్ అయినా లక్ కోసం కొనుగోలు చేసిన వాటికి ప్రాణ ప్రతిష్ట చేయించాల్సి ఉంటుంది. గ్రహానికి సంబంధించిన రత్నాలు ధరించే సమయంలో 5 లక్షల సార్లు జపం చేస్తూ ప్రాణ ప్రతిష్ట చేస్తూ ధరించాలి. నమ్మకంతో రత్నాలను ధరిస్తే మాత్రమే మంచి ఫలితాలను పొందే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.
నవరత్నాలను ధరించే సమయంలో జ్యోతిష్యుల, పండితుల సలహాలు, సూచనలు తీసుకోవాలి. ఇష్టనుసారం వాటిని ధరించడం వల్ల దీర్ఘకాలంలో ఇబ్బందులు తప్పవని చెప్పవచ్చు.