ఏపీలో విపక్షాలపై విరుచుకుపడే వైసీపీ నేతల్లో కొడాలి నాని స్టైలే వేరు! లొకేషన్ ఏదైనా.. ప్లేస్ ఎక్కడైనా.. వేదిక ఇంకేదైనా అన్నట్లుగా సాగిపోతుంటుంది నాని దండయాత్ర అని ఆయన అభిమానులుల్ చెబుతుంటారు. అవును… అసెంబ్లీలో అయినా, బహిరంగ సభల్లో అయినా, ప్రెస్ మీట్ లలో అయినా… కొడాలి దూకుడు మామూలుగా ఉండదు. ఈ నేపథ్యంలో కొడాలి నాని ఆరోగ్యంపై ఒక ప్రచారం తెరపైకి వచ్చింది!
అవును… వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని అనారోగ్యంతో ఉన్నారని, అపోలో ఆస్పత్రిలో చికిత్స చేయించుకుంటున్నారని, ఆ అనారోగ్యానికి కారణం క్యాన్సర్ అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుందని… ఒక కథనాన్ని ప్రసారం చేసింది ఏబీఎన్!
అయితే ఎలాంటి పక్కా సమాచారం లేకుండా… సోషల్ మీడియాలో ప్రచారం సాగుతుందని చెబుతూ.. ఇలా ఒక కథనాన్ని ప్రసారం చేయడంపై వైసీపీ కార్యకర్తలు, కొడాలి అభిమానులు ఫైరవుతున్నారు. అలాంటిది ఏదైనా ఉంటే… అధికారిక ప్రకటన వచ్చే వరకూ ఆగలేకపోతున్నారా అంటూ ఫైరవుతున్నారు. అలాంటిది ఏమీ లేదని ఆన్ లైన్ లో పోస్టులు పెడుతున్నారు.
కాగా.. కొడాలి నాని ఆరోగ్యంపై వార్తలు రావడం ఇదే మొదటిసారి కాదన్న సంగతి తెలిసిందే. గత ఏడాది “గడప గడపకూ మన ప్రభుత్వం” కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో.. కొడాలి నాని తీవ్ర కడుపునొప్పితో బాదపడిన సంగతి తెలిసిందే. వెంటనే ఆయన హుటాహుటిన హైదరాబాద్ కు వెళ్లి చికిత్స తీసుకున్నారన్ని వార్తలొచ్చాయి. అయితే కిడ్నీలో రాళ్లు ఉండటం వల్ల లేజర్ చికిత్స చేయించుకున్నారని తెలిసింది!
ఇదే క్రమంలో తాజాగా మరోసారి కొడాలి నాని తీవ్ర అనారోగ్యంతో ఉన్నారని, క్యాన్సర్ వ్యాదితో బాదపడుతున్నారని… అది కూడా సోషల్ మీడియాలో ప్రసారం అవుతుందని చెబుతూ.. ప్రధాన మీడియా సంస్థలు కూడా ఇలాంటి ఊగాహాణాలకు కథనాలని పేరు పెట్టి, ప్రత్యేక స్టోరీలు అని హెడ్డింగ్ పెట్టి ప్రసారం చేయడంపై సర్వత్రా విమర్శలు వెళ్లివెత్తుతున్నాయి!