ఎవరో ఒకరు.! ఎవరు పోటీ చేసినా సరే, పార్టీ గెలవాలని అనుకోవాలి.! కానీ, సత్తెనపల్లి ఇన్ఛార్జిగా కన్నా లక్ష్మినారాయణను టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు నియమించాక, అక్కడ రాజకీయ రచ్చ సొంత పార్టీలోనే షురూ అయ్యింది.
దివంగత కోడెల శివప్రసాద్ తనయుడు కోడెల శివరామ్, సత్తెనపల్లి నియోజకవర్గంపై ఆశలు పెట్టుకున్నారు. ‘నేనే పోటీ చేస్తా, నేనే గెలుస్తా..’ అంటున్నారాయన. ‘సత్తెనపల్లిలో గెలిచి, ఆ గెలుపుని నాన్నకి అంకితమిస్తా..’ అంటూ బల్లగుద్ది మరీ చెబుతున్నారు కోడెల శివరామ్.
డాక్టరుగా, పొలిటీషియన్‌గా సత్తెనపల్లి నియోజకవర్గంలో, ఆ మాటకొస్తే గుంటూరు జిల్లాలో కోడెల శివరామ్‌కి ప్రత్యేకమైన గుర్తింపు వుండేది. ఉమ్మడి తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయాక, ఆయన ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్‌గానూ పని చేశారు.
అయితే, అనేకానేక కారణాలతో ఆయన బలవన్మరణానికి పాల్పడటం అప్పట్లో అందర్నీ విస్మయానికి గురిచేసింది. టీడీపీ వేధింపులే కోడెల శివరామ్ మరణానికి కారణమని అప్పట్లో వైసీపీ ఆరోపించింది. కాదు కాదు, కోడెల శివప్రసాద్ మీద వైసీపీ మోపిన అభాండాలు, ఈ క్రమంలో ఆయన ఎదుర్కొన్న మానసిక సంఘర్షణ వెరసి.. ఆయన ఆత్మహత్యకు కారణమని టీడీపీ చెబుతుంటుంది.
కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి దూకి, బీజేపీ నుంచి టీడీపీలోకి వచ్చిన కన్నా లక్ష్మినారాయణకు పార్టీ నియోజకవర్గ పగ్గాలు అప్పగించడాన్ని కోడెల శివరామ్ జీర్ణించుకోలేకపోతున్నారు.
ఈ లంపాటకం సత్తెనపల్లి నియోజకవర్గంలో టీడీపీని ముంచేసేలా వుంది.!