‘హరి హర వీరమల్లు’ పక్కన పడేసినట్లేనా.?

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నాలుగు సినిమాల్లో నటిస్తున్నాడు. నాలుగూ సైమల్టేనియస్‌గా షూటింగులు జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. అందులో ‘బ్రో’ షూటింగ్ పూర్తయిపోయింది. హరీష్ శంకర్ సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’, సుజిత్ సినిమా ‘ఓజీ’ కూడా దాదాపు పవన్ కళ్యాణ్ సీన్లన్నీ షూటింగ్ ఓ కొలిక్కి వచ్చేశాయ్.

ఇక, మిగిలింది ‘హరి హర వీరమల్లు’ మాత్రమే. ఈ సినిమా మొదలు పెట్టి చాలా కాలమే అయినా ఇంతవరకూ ఓ కొలిక్కి తీసుకు రాలేకపోతున్నారు. అందుకు తెర వెనక రకరకాల కారణాలున్నాయని అంటున్నారు. డైరెక్టర్ క్రిష్‌తో ఏదో కిరికిరి జరుగుతోందని ఇన్‌సైడ్ సోర్సెస్ ద్వారా అందుతోన్న సమాచారం. అలాగే నిర్మాత మణిరత్నం కూడా ప్రస్తుతం యాక్టివ్‌గా లేరు.

ఈ కారణాలతోనే షూటింగ్ ఆగిపోయిందంటున్నారు. అదే నిజమైతే, ఈ సినిమా ఇప్పట్లో పూర్తయ్యే అవకాశాల్లేవని మాట్లాడుకుంటున్నారు. గ్యాప్ తీసుకుని, ఎలక్షన్ల తర్వాతే ఈ సినిమా పని పెట్టుకోబోతున్నాడట పవన్ కళ్యాణ్. చూడాలి మరి, నిజంగానే ‘హరి హర వీరమల్లు’ విషయంలో ఇలా జరుగుతోందా.? లేక ఇదంతా వుత్త పుకారేనా.?