రమేష్ ఆసుపత్రి యజమానులు పరారీలో ఉన్నారట!  హహహ!!!  

Ramesh hospital owners are absconding
ఒకసారి గతంలో జరిగిన సంఘటనలను నెమరు వేసుకుందాం.  డాటాదొంగగా అపఖ్యాతిపాలైన అశోక్ అనే వ్యక్తి పోలీసులు కేసులు పెట్టగానే పారిపోయాడు.  గరుడపురాణం శివాజీగా చెడ్డపేరు మూటగట్టుకున్న శివాజీ అనే గతకాలపు సినీనటుడు పోలీసులు తనకోసం వెతుకుతున్నారని తెలియగానే విదేశాలకు పారిపోబోతూ విమానాశ్రయం దగ్గర పోలీసుల వేటలో దొరికిపోయాడు.  ఇక రవిప్రకాష్ అనే మాజీ టీవీ 9  చీఫ్ కూడా తనమీద కేసులు పెట్టగానే పారిపోయి ఆ తరువాత చాలాకాలానికి పోలీసులకు పట్టుబడ్డాడు.  కొల్లు రవీంద్ర అనే ఒక మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ నాయకుడు హత్యకేసులో పోలీసులు నోటీసులు ఇవ్వగానే ఇంట్లోనించి పారిపోయాడు.  ఆ తరువాత పోలీసులకు చిక్కి ప్రస్తుతం జైల్లో ఉన్నాడు!  ఇక మొన్ననే కోవిద్ ఆసుపత్రిగా మార్చబడిన   విజయవాడలో స్వర్ణ ప్యాలస్ లో అగ్నిప్రమాదం జరిగి పదకొండుమంది అసహాయులైన రోగులు మరణించగానే ఆ హోటల్ యజమాని ముత్తవరపు శ్రీనివాసరావు, రమేష్ ఆసుపత్రి యజమాని డాక్టర్ పోతినేని రమేష్ పరారైపోయారట!   ఇక ప్రస్తుతం జ్యూడిషియల్ రిమాండ్ లో ఉన్న మాజీ మంత్రి అచ్చెన్నాయుడు మూలశంక ఆపరేషన్ జరిగి పారిపోలేని పరిస్థితిలో ఉండటంతో పోలీసులకు దొరికాడు కానీ, లేకపోతె ఈయన కూడా పారిపోయే ప్రయత్నం చేసేవారేమో?  
 
వీరందరిలో కనిపించే కామన్ పాయింట్ ఏమిటంటే వీరంతా తెలుగుదేశం పార్టీకి, ముఖ్యంగా చంద్రబాబునాయుడుకు వీరాభిమానులు.  ముఖ్యమంత్రి జగన్ ను విపరీతంగా ద్వేషించేవారిలో వీరు ముందు వరుసలో ఉంటారు.   మరొకటి ఏమిటంటే వీరందరికీ విపరీతమైన కులగజ్జి.  ఆ గజ్జి వీరికి నరనరాల్లో వ్యాపించి, ఇతర కులస్తులను పురుగులకన్నా హీనంగా భావిస్తారు. 

ఎందుకు పారిపోవాలి

 

Ramesh Hospitals 

అయితేమాత్రం?  పారిపోవాల్సిన అవసరం ఏముందని?  అర్ధరాత్రి ఒక దొంగ ఒక ఇంట్లో దూరాడు.  దూరంగా పోలీసు విజిల్ వినపడింది. వెంటనే వాడు భయంతో అక్కడినుంచి పారిపోతాడు.  నడిరోడ్డు మీద ఎవడో ఒక రోమియో బస్సు కోసం ఎదురు చూస్తున్న ఒక యువతిపట్ల అసభ్యంగా ప్రవర్తిస్తుంటాడు.  వాడిని వారించడానికి అక్కడున్న “మొగోళ్ళు” అందరూ భయపడతారు. ఎందుకంటే వాడిచేతిలో కత్తో, తుపాకీయో ఉంటుంది.  అంతలో దూరంగా ఒక కానిస్టేబులు తన బైక్ మీద వస్తుంటాడు.  అంతే…అంత పెద్ద రోమియో కూడా పిక్కబలం చూపిస్తాడు…వాళ్లంతా ఆర్ధికంగా బలహీనులు, రాజకీయ అండదండలు లేనివారు.దొరికితే పోలీసులు ఎముకలు విరగ్గొడతారు అనే భయం ఉంటుంది. మరి మనం మొదటిపేరాలో చెప్పుకున్నవారంతా సామాన్యులు కారే?  సమాజంలో పేరుప్రఖ్యాతులు, రాజకీయబలం, ఆర్ధికబలం, అంగబలం, ఇబ్బడిముబ్బడిగా ఉన్నవారే.  పైగా అధిక విద్యావంతులు.  ఇలాంటివారు సైతం ఎందుకు పారిపోతున్నారు?   తమమీద ఆరోపణలు రాగానే, వెంటనే పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయి విచారణకు తాము సహకరిస్తామని, అందుబాటులో ఉంటామని పోలీసులకు  లేదా కోర్టులకు లాయర్లద్వారా విన్నవించుకుంటే స్టేషన్ బెయిల్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది.  సామాన్య రౌడీలను చితకకొట్టినట్లు ఈ ఘరానా పెద్దమనుషులను పోలీసులు కొట్టరు కదా?  అసలు పోలీసులను చూస్తే దొంగలు మాత్రమే పారిపోతారు.  ఈ ఘరానాదొంగలు కూడా పోలీసులకు భయపడి పారిపోయారంటే వీరు కచ్చితంగా నేరగాళ్లే అనడానికి ఇంతకన్నా వేరే సాక్ష్యం దేనికి?  అయినా వీరు ఎక్కడికి పారిపోగలరు?  దేశం విడిచిపెట్టి పారిపోయే అవకాశం ప్రస్తుతం లేదు.  కాబట్టి వీరు ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణాలో మాత్రమే ఆశ్రయం పొందగలరు.  వీరిని పట్టుకోవడం పోలీసులకు చిటికెలో పని.  కానీ, పట్టుకోరు.  వెతుకుతున్నామని, వారి బంధువుల ఇళ్ళమీద నిఘా పెట్టామని కుంటిసాకులు చెప్తుంటారు.  ఈలోపల ఆ నేరగాళ్లు ముందస్తు బెయిల్ తెచ్చుకుంటారు.  అప్పటివరకూ వీరికోసం పోలీసుల “వెతుకులాట”  సాగుతూనే ఉంటుంది.  ఈ పరిస్థితి ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే కాదు.  దేశమంతా ఇంతే.

వ్యవస్థల మీద నమ్మకం పోతుందా?  

ఇక్కడే వ్యవస్థల మీద సామాన్యులకు నమ్మకం సన్నగిల్లుతుంది.   అచ్చెన్నాయుడు పైల్స్ ఆపరేషన్ చేయించుకున్నారు.  దానికి మూడురోజులు ఆసుపత్రిలో ఉండాలి.  ఇంటికొచ్చాక నాలుగురోజుల విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది.  కానీ, అచ్చెన్నాయుడు మాత్రం ఈ చిన్న చికిత్స కోసం అత్యంత ఖరీదైన రమేష్ ఆసుపత్రిలో కోర్టు ఆదేశాల మేరకు చేరారు.  అసలు ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వరంగంలో అత్యుత్తమ ఆసుపత్రులు ఉన్నాయి.  పైల్స్ చికిత్స ప్రాణాంతకం కాదు.  అలాంటప్పుడు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ఉండాలని కోర్ట్ ఎందుకు ఆదేశించలేదు?  పైగా తెలుగుదేశం పార్టీకి చెందిన వారి ఆసుపత్రిలో ఉండటానికి ఎలా అనుమతి ఇచ్చింది?  పోనీ, ఇచ్చిందే అనుకుందాము.  పదిరోజుల తరువాతో, ఇరవై రోజుల తరువాతో “ఇంకా ఎన్నాళ్ళు చేస్తారు వైద్యం?” అని ఆసుపత్రిని నిలదీయాలి కదా?  మూలశంక చికిత్సకోసం ఎన్నాళ్ళు విశ్రాంతి తీసుకోవాలి అని గౌరవ న్యాయస్థానం వారు తమకు తెలిసిన, నమ్మకం ఉన్న  ఏ డాక్టర్ నైనా నివేదిక కోరవచ్చు కదా?  పైగా ప్రయివేట్ ఆసుపత్రుల్లో పనిచేసే డాక్టర్ల నివేదికలను హైకోర్టు ఎలా విశ్వసిస్తుంది?  వారు  నివేదికలు అడగాల్సింది ప్రభుత్వ వైద్యులను కదా?  

కోర్టు సుమోటుగా తీసుకుంటుందా?

రమేష్ ఆసుపత్రి అంటే అదేమీ ధర్మాసుపత్రి కాదు. ఫైవ్ స్టార్ ఆసుపత్రి.  అక్కడ చేరిన రోగి తన ఆస్తులను  అమ్ముకుంటే కానీ బయటపడడు. కోవిద్ చికిత్సకు రోజుకు లక్ష రూపాయలు ఛార్జ్ చేస్తున్నారట!  స్వర్ణ పాలస్ లో రోగులుగా ఉన్న ముప్ఫయి మందిలో ఐదారుగురు మాత్రమే కరోనా బాధితులు. మిగిలినవారిని కరోనా పేరు చెప్పి ఆసుపత్రిలో చికిత్స చేస్తున్నారు మన దొంగ డాక్టర్లు!    అరవై రోజులనుంచి తమ పర్యవేక్షణలో ఉన్న ఒక మాజీమంత్రికి కరోనా ఎలా సోకింది? ఆయన్ను చూడటానికి పార్టీవారు, అభిమానులు ఎవరికీ అనుమతి ఉండదు. ఆయన విశ్రాంతి తీసుకుంటున్న గదిలోకి డాక్టర్లు, నర్సులు తప్ప మరెవ్వరూ ప్రవేశించలేరు కదా?  అంటే ఆయనకు ఆసుపత్రిలో పనిచేసే డాక్టర్లు, నర్సుల ద్వారా కరోనా అంటుకుందా?  అలాంటపుడు ఆ సిబ్బందితో ఆసుపత్రిలో ఎలా పనిచేయిస్తారు?  హైకోర్టు ఈ ప్రశ్నలు ఆసుపత్రి యాజమాన్యానికి సంధించి సంజాయిషీ అడుగుతుందా?  పోలీస్ కస్టడీలో ఉండాల్సిన వ్యక్తిని చికిత్స పేరుతో ఆసుపత్రిలో ఉండటానికి అనుమతించిన హైకోర్టు .. ఇప్పుడు అచ్చెన్నాయుడుకు కరోనా సోకడం పట్ల ఎవరిని బాధ్యులను చేస్తుంది?  ఒకవేళ జైల్లో ఉన్నసమయంలో ఆయనకు కరోనా సోకితే ఈపాటికి తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు ఎంత ఆందోళనలు చేసేవారు?  జగన్ ను రాజీనామా చెయ్యాలని కాకుల్లా అరిచేవారు కదా?  ఇప్పుడు వారు ఎందుకు రమేష్ ఆసుపత్రి ముందు ధర్నాలు చెయ్యడం లేదు?  

రమేష్ హాస్పిటల్ కు అగ్నిమాపక అనుమతులు లేవా?

ఇక అగ్నిప్రమాదం జరిగిన స్వర్ణ ప్యాలస్ కు అగ్నిమాపక అనుమతులు లేవని, మునిపల్ అనుమతులు లేవని, సేఫ్టీ మెజర్స్ లేవని అధికారులు బోలెడంత ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు!  స్వర్ణ ప్యాలస్ ను కోవిద్ ఆసుపత్రిగా మార్చుతున్నపుడు ఏమి చూసి అనుమతులు ఇచ్చారు అధికారులు?  ఆ ఆసుపత్రి ఏమీ ఊరిబయట లేదే?  నగరం నడిబొడ్డునే ఉన్న ఆసుపత్రిని ఇన్నాళ్లూ ఒక్క ప్రభుత్వ అధికారి కూడా తనిఖీ చెయ్యలేదా?  అంటే ఆసుపత్రి యాజమాన్యం ఇచ్చిన “తాంబూలాలను” ఆస్వాదిస్తూ కళ్ళు మూసుకున్నారన్న మాట! దీన్నిబట్టి అధికార యంత్రాంగంలో కూడా తెలుగుదేశం స్లీపర్ సేల్స్ మిక్కుటంగా ఉన్నాయనే అర్ధం కదా!  
 
మన ప్రజాస్వామ్యంలో అన్నీ ప్రశ్నలే. ఒక్కదానికీ జవాబు దొరకదు. అందరూ దొంగలే. కాకపోతే దొరికినవాడు దొంగ. దొరకానివాడు దొర. అంతే తేడా! 
 
ఇలపావులూరి మురళీ మోహన రావు 
సీనియర్ రాజకీయ విశ్లేషకులు