కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వరస్వామి దేవస్థానం చుట్టూ.. జరగకూడనివి జరుగుతున్నాయ్.! వెంకటేశ్వరస్వామిని కాలినడకన దర్శించుకునే భక్తులు ఇటీవలి కాలంలో, వన్యమృగాల కారణంగా ఇబ్బందికర పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నమాట వాస్తవం.
కానీ, టీటీడీ ఏం చేస్తోంది.? భద్రతా సిబ్బంది అసలు పని చేస్తున్నారా.? లేదా.? ఇటీవల ఓ చిన్నారిని, చిరుతపులి ఎత్తుకుపోయింది. చిరుతల సంచారం, తిరుమల కొండపైనా, ఘాట్ రోడ్లమీదా, తిరుపతి నగరంలోనూ ఎక్కువయిపోయిన సంగతి తెలిసిందే.
అడవిలో ఆహారం, నీళ్ళు దొరక్కపోవడం వల్లనో, ఇతరత్రా కారణాల వల్లనో.. వన్యమృగాలు జనాల్లోకి వస్తున్నాయి. ఈ క్రమంలో జరగకూడని ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. వన్యమృగాల నుంచి భక్తులకు రక్షణ కల్పించడం కోసం, ఒక్కో భక్తుడికీ చేతి కర్ర అందిస్తారట టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి.
ఇటీవల టీటీడీ ఛైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన భూమన, ఈ విషయాన్ని తాజాగా వెల్లడించారు. దాంతో, అందరూ ముక్కున
వేలేసుకుంటున్నారు. ఊత కర్ర భక్తుల చేతికి అందించడమేంటి.? పైగా, హిందూ ధర్మంలో ఊత కర్రకి వున్న ప్రాధాన్యత.. మనిషి నాగరికతలో ఆ ఊత కర్రకి వున్న ప్రాధాన్యత.. అంటూ ఏవేవో అర్థం పర్థం లేని మాటలు చెప్పారు భూమన.
చెప్పాలనుకున్న విషయాన్ని చాలా స్పష్టంగా, విడమరిచి చెప్పడంలో దిట్ట భూమన. కానీ, ఎందుకో ఈసారి ఆయనా తడబడ్డారు. సూచన ఎవరిదోగానీ, భూమన నోట.. ఈ ‘ఊత కర్ర’ పథకం ప్రకటితమయ్యింది. నవ్విపోతున్నారు.. ఈ మాట విన్నాక అందరూ.
చేతిలో కర్రని చూసి, చిరుత పులి కావొచ్చు, ఇతరత్రా క్రూర మృగం కావొచ్చు భయపడే పరిస్థితి వుంటుందా.?