Tirumala: తిరుమల వెళ్లే రాజకీయ నాయకులు అలర్ట్… నోరు జారారో అంతే సంగతులు?

Tirumala: కలియుగ దైవమైనటువంటి సాక్షాత్తు తిరుమల తిరుపతి ఆలయంలో సరికొత్త నిబంధనలు నేటి నుంచి అమలులోకి వచ్చాయి. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా బిఆర్ నాయుడు బాధ్యతలు తీసుకున్నారు. ఇక ఈయన బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇటీవల మొదటి సారి పాలకమండలి సమావేశాన్ని ఏర్పాటు చేసి తిరుమలలో సరికొత్త విధివిధానాలను అమలులోకి తీసుకువచ్చారు.

ఈ కొత్త నిబంధనలలో భాగంగా ఎవరైనా రాజకీయ నాయకులు కానీ సినిమా సెలబ్రిటీలు కానీ తిరుమల కొండకు వెళ్లి రాజకీయాల గురించి మాట్లాడిన ఆ వీడియోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోబడతాయని టీటీడీ చైర్మన్ బి.ఆర్ నాయుడు తెలియజేశారు. ఇక ఈ నిబంధనలు నేటి నుంచి అమలులోకి రాబోతున్నాయి.

నిత్యం గోవింద నామస్మరణలతో మారుమోగే తిరుమల కొండపై కేవలం దేవుడి గురించి మాత్రమే మాట్లాడాలి అక్కడికి వెళ్లిన తర్వాత పూర్తిగా ఆధ్యాత్మిక చింతనలో ఉండాలి తప్ప కొండపైకి వెళ్లి రాజకీయాల గురించి మాట్లాడుతూ ఆలయ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించకూడదని తెలిపారు. తిరుమలకు విచ్చేసే రాజకీయ నేతలు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని టీటీడీకి సహకరించాలని విజ్ఞప్తి చేసింది. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

ఇకపై ఏ పార్టీకి చెందిన రాజకీయ నాయకులైన తిరుపతిలో అడుగుపెట్టిన కేవలం ఆలయ గొప్పతనం గురించి మాట్లాడే తప్ప రాజకీయాల గురించి మాట్లాడటానికి వీలు లేకుండా పోయింది. ఇలా కొత్తగా వచ్చిన చైర్మన్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం పై భక్తుల నుంచి కూడా సర్వత్ర ప్రశంసలు దక్కుతున్నాయి. ఇది సరైన నిర్ణయమేనని భక్తులు కూడా ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు.